కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

కేరళలోని పాలక్కడ్‌లో లారీ అతివేగం వల్ల నలుగురు విద్యార్థులు స్పాట్‌లో మృతి చెందారు. అతివేగంతో వచ్చిన లారీ అదుపు తప్పి, బస్సు కోసం ఆగి ఉన్న నలుగురు విద్యార్థులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

author-image
By Kusuma
New Update
K accident

ప్రస్తుతం రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతివేగం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా కేరళలోని పాలక్కాడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కల్లడికోడ్ సమీపంలోని పానయం పాడు దగ్గర స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో విద్యార్థులు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!

అతివేగం కారణంగా..

ఈ  సమయంలో సిమెంట్ లోడుతో ఉన్న లారీ వేగంగా ప్రయాణిస్తూ అదుపు తప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు విద్యార్థులు అక్కడిక్కడే మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేవలం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంటనే లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: US: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!

ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!

ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్‌

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు