/rtv/media/media_files/2024/12/12/DZsJ4Kzs02C0SIVANW0X.jpg)
keerthi Suresh marriage
keerthi Suresh marriage: టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ను వివాహం చేసుకున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లి ఫొటోలను కీర్తి తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!
హిందూ సంప్రదాయాల ప్రకారం..
హిందూ సంప్రదాయాల ప్రకారం కీర్తి పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గోవాలో రెండు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలకు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి, హీరో నాని పలువురు సెలెబ్రెటీలు సందడి చేశారు. ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. కీర్తి సురేష్ ఫ్యామిలీకి కూడా ఆంటోనీ బాగా తెలిసినవాడేనని సమాచారం. కీర్తి పెళ్ళిలో ఎల్లో, గ్రీన్ కలర్ పట్టు చీర, ఆభరణాలతో అందంగా ముస్తాబైంది. ఆంటోని పట్టు పంచను ధరించారు.
Also Read: ఇంకోసారి అలా రాస్తే ఊరుకునేది లేదు.. సాయి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్
ప్రస్తుతం కీర్తి వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ చిత్రాలతో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'బేబీ జాన్' ట్రైలర్ విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యాక్షన్, కామెడీ , సస్పెన్స్ సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!