ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వారమే ఈ బిల్లు ప్రవేశపెట్టనునన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజపీ విప్.. పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇది జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. Also Read: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,100 ఆర్థిక సాయం గతంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న వేళ.. మరోసారి కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. Also read: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా..కేంద్రం ఏర్పాట్లు మరోవైపు జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయులు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లబ్ధి చేకూరుతుందని, ప్రాంతీయ పార్టీల అస్థిత్వానికి దెబ్బపడుతుందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఏకాభిప్రాయం కుదుర్చేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్చున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. Also Read: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్! జమిలీ ఎన్నికల విధానానికి 30కి పైగా పార్టీలు సమర్థించాయి. కాంగ్రెస్‌తో సహా 15 పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. అసలు ఈ ప్రతిపాదన అనేది ఆచరణాత్మకమైనదని కాదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగంలో పలు సెక్షన్లు కూడా సవరణలు చేయాల్సి ఉంటుంది. మరి జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం అవుతుందా ? లేదా ? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. Also Read: హిజాబ్ ధరించకపోతే ఉరిశిక్ష–ఇరాన్ లో కొత్త చట్టం