Hyderabad : మంచు ఫ్యామిలీ ఫైట్‌పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు కుటుంబ గొడవ వారి వ్యక్తిగతమని చెప్పారు. మంచు మనోజ్ ను ఏడాదిపాటు బాండ్ ఓవర్ చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రిటీలనుంచి బైండోవర్ తీసుకోవడం ఇదే తొలిసారి అన్నారు.
Also Read : మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,100 ఆర్థిక సాయం
బౌన్సర్లు గొడవతోనే ఇదంతా జరిగింది..
ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన సీపీ సుధీర్ బాబు.. మోహన్ బాబు ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మనోజ్, విష్ణు, మోహన్ బాబు బౌన్సర్లు గొడవతోనే ఇదంతా జరిగిందని తెలిపారు. ఇప్పటికే ముగ్గురిపై కేసులు నమోదు చేశాం. మనోజ్ నుంచి లక్ష రూపాయల బాండ్ తీసుకున్నాం. మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేశాం. మోహన్ బాబు మేనేజర్ ను అరెస్టు చేశాం. తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రిటీలనుంచి బైండోవర్ తీసుకోవడం ఇదే మొదటిసారి. పూర్తి విచారణ తర్వాత నిందితులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇది కూడా చదవండి: మోహన్‌బాబుకు 10 ఏళ్ల జైలుశిక్ష తప్పదా ? చట్టం ఏం చెబుతోంది..
మనోజ్ లక్ష బాండ్ సమర్పించి శాంతిభద్రతలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజా సామరస్యానికి భంగం కలిగించే ఎలాంటి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడబోనని అధికారులకు హామీ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా వివాదాలలో పాల్గొనడం లేదని, చట్టబద్ధతను సమర్థించటానికి కట్టుబడి ఉన్నానని మనోచ్ చెప్పినట్లు సీపీ తెలిపారు.
Also Read : ఇంకోసారి అలా రాస్తే ఊరుకునేది లేదు.. సాయి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : రోజుకు రూ.2 లక్షలు.. ఏఈ నిఖేశ్‌కుమార్ అక్రమార్జనలో సంచలనాలు!