🔴Live News Updates: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Fish Venkat: టాలీవుడ్ లో విషాదం..నటుడు ఫిష్ వెంకట్ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు ఫిష్ వెంకట్ కొంత సేపటి క్రితం కన్నుమూశారు(Fish Venkat Death News). కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే వెంకట్ తుది శ్వాస విడిచారని బంధువులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని చందానగర్ లో ఫిష్ వెంకట్ రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోయాయని కుటుంబ సభ్యులు చెప్పారు. రెండు కిడ్నీలు మార్చాలని...కానీ వైద్యం చేయించేందుకు డబ్బులు లేవని వెంకట్ కుమార్తె రెండు రోజుల క్రితం మీడియాకు తెలిపారు. ఎవరైనా సహాయం చేయాలన కూడా ఆమె విజ్ఞప్తి చేశారు.

Also Read: ఫిష్ వెంకట్ చేసిన బెస్ట్ కామెడీ మూవీస్ ఇవే.. మీరూ చూశారా?

Also Read: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్

వందకు పైగా సినిమాల్లో..

ఫిష్‌ వెంకట్‌ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్‌. ముషీరాబాద్‌ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్‌ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి అతనిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. డైరెక్టర్ వీవీ వినాయక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకట్ వందకు పైగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్నపాటి విలన్ గా చేశారు. ఆది, దిల్, బన్ని, అత్తవారింటికి దారేది, డీజే టిల్లు లాంటి చిత్రాల్లో అలరించారు.  

Also Read: ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. చేపలు అమ్ముకునే వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు?

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైలోనైనా మిథున్‌రెడ్డి అరెస్టు!

  • Jul 19, 2025 20:55 IST

    వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

    మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు.

     

    YSRCP MP Mithun reddy Arrested in Money laundering case
    YSRCP MP Mithun reddy Arrested in Money laundering case

     



  • Jul 19, 2025 20:55 IST

    మేడ్చల్‌లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య

    మేడ్చల్‌లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్‌గా గుర్తించారు. అప్పులు తీర్చినప్పటికీ కొందరు తనను వేధిస్తున్నారని అందుకే సూసైడ్‌ చేసుకుంటున్నట్లు ఓ లాడ్జీలో సెల్ఫీ వీడియో తీసుకొని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు.



  • Jul 19, 2025 20:21 IST

    ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందూ హత్య

    హైదరాబాద్‌లో సీపీఐ నాయకుడు చందు నాయక్‌ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈనెల 15న మలక్‌పేటలోని శాలివాహననగర్‌ పార్కులో చందునాయక్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

    chandu



  • Jul 19, 2025 18:21 IST

    భాగ్యనగర్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో వాహనదారుల అవస్థలు

    హైదరాబాద్‌లో వర్షానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, సికింద్రాబాద్‌, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి.

     

    HYD Rain
    HYD Rain

     



  • Jul 19, 2025 18:21 IST

    ఐ లవ్ యూ.. అమ్మా అంటూ.. ప్రాణం తీసుకున్న యువకుడు

    అమ్మా ఐ యామ్ వెరీ సారీ..ఇక నీ కొడుకు లేడమ్మా..జాగ్రత్తగా ఉండు..మళ్లీ వస్తాను..చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు..ప్లీజ్ మా...ఐ మిస్ యూ మా... లవ్ యూ మా...అంటూ తల్లికి వీడియో కాల్ చేసి ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    Young man suicide



  • Jul 19, 2025 16:24 IST

    ‘హరి హర వీరమల్లు’ టికెట్‌ ధరలు పెరుగుదల

    హరి హర వీరమల్లు’ మూవీ రిలీజైన 10 రోజల వరకు టికెట్‌ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 (లోయర్‌ క్లాస్) రూ.150 (అప్పర్‌ క్లాస్‌), మల్టీప్లెక్స్‌లో రూ.200 వరకు పెంచుకోవచ్చని తెలిపింది.

     

    Hari hara veera mallu
    Hari hara veera mallu

     



  • Jul 19, 2025 16:01 IST

    వందకు పైగా సినిమాల్లో నటన.. చివరి క్షణాల్లో పట్టించుకోని టాలీవుడ్‌

    టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్‌ ఫిష్‌ వెంకట్‌ తుదిశ్వాస విడిచారు. ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాయన.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. అయితే ఆయన మృతిని టాలీవుడ్‌ పట్టించుకోకపోవడం మరింత బాధకరంగా మారింది.

     

    fish venkat
    Fish Venkat

     



  • Jul 19, 2025 15:14 IST

    ఫిష్ వెంకట్ అంత్యక్రియలు



  • Jul 19, 2025 14:47 IST

    ఆదిలాబాద్‌లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్.. భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం

    ఆదిలాబాద్‌లో జిమ్ నిర్వహిస్తున్న షేక్ ఆదిల్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు తన దగ్గరికి వచ్చే ట్రైనర్స్‌కి కూడా ఇస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతని జిమ్‌లో భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    drugs



  • Jul 19, 2025 14:01 IST

    AP Crime : భార్యను వెంటాడి వేటాడి గొంతు కోసి చంపి.. ఆపై భర్త ఏం చేశాడంటే!

    తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. 15ఏళ్ల క్రితం లోకేశ్వర్‌తో ఉషకు వివాహం జరిగింది.

    wife



  • Jul 19, 2025 13:08 IST

    Mynampally : బట్టలిప్పి నడిరోడ్డు మీద నిలబెడతా... కేటీఆర్ కు మైనంపల్లి వార్నింగ్!

    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు.  గతంలో కేటీఆర్‌ షాడో సీఎంగా వ్యవహరించారని, సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు.

    mynampally



  • Jul 19, 2025 12:41 IST

    Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు స్పాట్‌ డెడ్ - తండ్రి, ఇద్దరు కొడుకులు సహా..!

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధుర జిల్లాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు.

     

    uttar pradesh tragic accidents six killed on yamuna expressway in mathura
    Tragic Accident

     



  • Jul 19, 2025 12:41 IST

    IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు

    ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దారి సరిగా కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని మరోసారి గాల్లోకి తీసుకెళ్లారు. 15 నిమిషాల పాటు గాల్లోనే తిప్పి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

     

    IndiGo Flight
    IndiGo Flight

     



  • Jul 19, 2025 11:12 IST

    Earthquake: ఒకేసారి మూడు భూకంపాలు.. పరుగులు తీసిన ప్రజలు

    ఉత్తరాఖండ్‌, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లలో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని ఉత్తరాఖండ్‌ చమోలిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

     

    Earthquake
    Earthquake

     



  • Jul 19, 2025 11:12 IST

    Food Piece Stuck In Throat: ఏపీలో దారుణం.. రెండేళ్ల బాలుడి ప్రాణం తీసిన దోశ

    అనంతపురం జిల్లాలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. తపోవనం ప్రాంతానికి చెందిన రెండేళ్ల బాలుడు కుశాల్ దోసె తింటుండగా.. ఒక ముక్క గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

     

    Boy died after food piece stuck in throat
    Boy died after food piece stuck in throat

     



  • Jul 19, 2025 11:11 IST

    Stray Dog Attack: తెలంగాణలో గుండె పగిలే విషాదం.. మూడేళ్ల బాలుడి ప్రాణం తీసిన కుక్కలు

    మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లాతండాలో వీధికుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు నిథున్ మరణించాడు. కిరాణా షాపు నుంచి వస్తుండగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది.

     

    Stray Dogs Attacked 3 years old boy
    Stray Dogs Attacked 3 years old boy

     



  • Jul 19, 2025 11:11 IST

    Vizag Fire Accident: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియోలు

    విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండి గుండం దగ్గర గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

     

    Major fire breaks out near Gandigundam godown
    Major fire breaks out near Gandigundam godown

     



  • Jul 19, 2025 11:11 IST

    Rain Updates: ఘోరమైన విషాదం.. కుండపోత వర్షం.. 24 గంటల్లో 63 మంది మృతి

    పాకిస్థాన్‌లో వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన కుండపోత వర్షాలు, వరదల కారణంగా 63 మంది మరణించగా, 290 మందికి పైగా గాయపడ్డారని NDMA ప్రకటించింది. విద్యుదాఘాతం, భవనాలు కూలిపోవడం, ఆకస్మిక వరదల వల్ల ఈ మరణాలు సంభవించాయి.

     

    Pakistan monsoon rains kill 63 in 24 hours
    Pakistan monsoon rains kill 63 in 24 hours

     



  • Jul 19, 2025 11:10 IST

    Tron: Ares Telugu Trailer: ‘ట్రోన్: ఆరెస్’ తెలుగు ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సన్నివేశాలు

    డిస్నీ 'ట్రోన్: ఆరెస్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. జారెడ్ లెటో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రైలర్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అక్టోబర్ 10, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

     

    Tron Ares Telugu Trailer
    Tron: Ares Telugu Trailer

     



  • Jul 19, 2025 10:34 IST

    Dementia Symptoms: ముసలి వాళ్ళ చాదస్తానికి కారణం ఈ జబ్బే..!

    డిమెన్షియా అనేది మెదడు పనితీరు క్రమంగా తగ్గిపోయే రుగ్మతి. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు ఆల్జీమర్స్ ప్రధాన కారణం. దీనిని పూర్తిగా నయం చేయలేకపోయినా, చికిత్సల ద్వారా నియంత్రించవచ్చు.

     

    Dementia Symptoms
    Dementia Symptoms

     



  • Jul 19, 2025 09:47 IST

    Prabhas - Samantha: దుమ్మురేపిన ప్రభాస్, సమంత.. ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్!

    ఆర్మాక్స్ విడుదల చేసిన జూన్‌ నెల మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలో ప్రభాస్, సమంత టాప్ ప్లేస్‌లో నిలిచారు. అలాగే టాప్ 10లో టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు చోటు దక్కించుకోవడం విశేషం.

     

    Prabhas - Samantha
    Prabhas - Samantha

     



  • Jul 19, 2025 08:07 IST

    Christopher Nolan's The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ "ది ఒడిస్సీ" రికార్డుల మోత.. రిలీజ్ కి సంవత్సరం ముందే హౌస్‌ఫుల్!!

    క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న "ది ఒడిస్సీ" ఐమ్యాక్స్ 70mm టికెట్లు విడుదలైన గంటలోనే 95% అమ్ముడై రికార్డు సృష్టించింది. 2026లో విడుదల కానున్న ఈ మూవీ పూర్తిగా ఐమ్యాక్స్ ఫిల్మ్ కెమెరాలతో షూట్ అవుతోంది.

     

    Christopher Nolans The Odyssey
    Christopher Nolans The Odyssey

     



  • Jul 19, 2025 07:10 IST

    Kuppam Crime: ‘‘నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా?’’.. చంద్రబాబు ఇలాకాలో దారుణం!

    ఏపీలోని కుప్పంలో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో పలు సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే ఆ వివాహిత సూసైడ్ చేసుకుందని తెలిపారు. ‘‘నీకు నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా?.. నేను చనిపోతున్నా’’ అంటూ రిప్లై ఇచ్చి చనిపోయింది.

     

    Married woman commits suicide due to extramarital affair in Kuppam
    Married woman commits suicide due to extramarital affair in Kuppam

     



  • Jul 19, 2025 07:09 IST

    Highest Rainfall : హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. ఇవాళ కూడా భారీ వర్షాలు!

    హైదరాబాద్‌లో నిన్న భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 60-100 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 150 మి.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

    telnagana-rains



  • Jul 19, 2025 07:09 IST

    MP Midhun Reddy : వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైలోనైనా మిథున్‌రెడ్డి అరెస్టు!

    ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.  ఆయనకు హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేయడంతో సిట్ అధికారులు అలెర్ట్ అయ్యారు శుక్రవారమే విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు.

    midhun-reddy



  • Jul 19, 2025 07:08 IST

    Fish Venkat : ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. చేపలు అమ్ముకునే వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు?

    ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. ఆయన ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేసేవాడు. అందుకే అందరూ ఆయన్ను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో 1971 ఆగస్టు 3న జన్మించారు.

    fish-venkat



Advertisment
Advertisment
తాజా కథనాలు