/rtv/media/media_files/2025/07/19/stray-dogs-attacked-3-years-old-boy-2025-07-19-09-35-33.jpg)
Stray Dogs Attacked 3 years old boy
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లాతండాలో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. నిన్న (శుక్రవారం) ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కలు బాలుడిని తీవ్రంగా కరిచి లాక్కెళ్లయ్యాయి. ఈ దాడిలో ఆ బాలుడు మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
బాలుడిపై కుక్కల దాడి
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లా తండాకు చెందిన జరుప్ల హోబ్యా, లావణ్య దంపతులకు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చివరివాడు నితున్ (3) పుట్టిన రోజు గురువారం కావడంతో గ్రాండ్‌గా వేడుక ఏర్పాటు చేశారు.
Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం నితున్ స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో భోజనం చేశాడు. తన అక్కా, అన్నలు ఇంట్లో ఆడుకుంటుండగా.. నితున్ ఒక్కడే సమీపంలోని షాప్‌కు వెళ్లాడు. అదే సమయంలో దాదాపు ఆరేడు వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా బాలుడు నితున్‌పై దాడి చేశాయి. బాలుడిని తీవ్రంగా కరిచి లాక్కెళ్లయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు కుక్కలను తరిమేశారు.
Also Read: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
అప్పటికి నితున్ అపాస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో నిత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆ బాలుడిని నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే నితున్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటి వరకూ అమ్మ చేతి గోరుముద్దలు తిన్న చిన్నారి బాలుడు.. తోబుట్టువులతో సంతోషంగా ఆడుకుని దుకాణానికి వెళ్లొచ్చేలోపు ఈ ఘోరమైన విషాదం జరగడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.