Tron: Ares Telugu Trailer: ‘ట్రోన్: ఆరెస్’ తెలుగు ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సన్నివేశాలు

డిస్నీ 'ట్రోన్: ఆరెస్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. జారెడ్ లెటో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రైలర్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అక్టోబర్ 10, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

New Update
Tron Ares Telugu Trailer

Tron: Ares Telugu Trailer

వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ట్రోన్: ఆరెస్’ (Tron: Ares). తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. 

Tron: Ares Telugu Trailer

ట్రైలర్‌లో చూపించిన అధునాతన గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అంతేకాకుండా ట్రైలర్‌లోని నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసి, ప్రేక్షకులను లీనం చేస్తుంది. జారెడ్ లెటో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో గ్రెటా లీ, గిలియన్ ఆండర్సన్, కామెరూన్ మోనాఘన్, సారా గ్యాడాన్, రావు ఆలిక్ జెర్రీ, జోడి టర్నర్-స్మిత్ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం AI ప్రపంచంలోకి మానవత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ప్రోగ్రామ్ ఆరెస్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ 10, 2025న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో సహా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు