Vizag Fire Accident: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియోలు

విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండి గుండం దగ్గర గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

New Update
Major fire breaks out near Gandigundam godown

Major fire breaks out near Gandigundam godown

విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండి గుండం దగ్గర గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి డిజాస్టర్, ఎన్ డీ ఆర్ ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు సెక్యూరిటీ సిబ్బంది మినహా ఇంకెవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. 

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఇటీవల మరో దారుణం

ఇటీవల పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బీసీ కాలని సమీపంలోని పొలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు శ్రీను, మంగమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు వాళ్లని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

 ఈ ఘటనకు కారణం శ్రీను తమ్ముడి కొడుకని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహారిగోడ విషయంలో గత కొన్ని రోజులుగా శ్రీను, అతడి సోదరుడి మధ్య వివాదం జరుగుతోంది. వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. మరోవైపు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు