Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు.

New Update
YSRCP MP Mithun reddy Arrested in Money laundering case

YSRCP MP Mithun reddy Arrested in Money laundering case

మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. మద్యం కుంభకోణంలో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు. విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు అధికారులు విచారించారు. అనంతరం ఆయన్ని అరెస్టు చేశారు. మరోవైపు ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అలాగే శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన్ని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ ఎంపీ అరెస్టు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయమవుతోంది. 

Also read: త్వరలో మూడో అతి పెద్ద ఆర్థికశక్తిగా భారత్.. అమిత్‌ షా కీలక ప్రకటన

Also Read :  కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...

YSRCP MP Mithun Reddy Arrest

ఇదిలాఉండగా సిట్‌ అధికారులు ఇప్పటికే మిథున్ రెడ్డిపై లుకౌట్‌ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఏపీలో లిక్కర్ స్కామ్‌కి వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. అంతేకాదు వైఎస్‌ జగన్‌కు ఈయన అత్యంత సన్నిహితుడని పేర్కొంది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వచ్చే ముడుపులు వసూళ్లు చేసేందుకు రాజ్‌ కెసిరెడ్డతో కలిసి హవాలా నెట్‌వర్క్‌ రూపొందించడంలో, అలాగే వచ్చిన మొత్తాన్ని బిగ్‌బాస్‌కు చేర్చడంలో ఆయనే కీలకమని తేల్చిచెప్పింది. 

Also Read: ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందూ హత్య

అంతేకాదు బహుళ అంచెల హవాలా నెట్‌వర్క్‌ రూపకల్పన, దాన్ని అమలు చేయడం, పర్యవేక్షించడం అనేది మిథున్‌రెడ్డి కన్నుసన్నల్లోనే జరిగిందని సిట్ నిర్ధారించింది. దీనికి సంబంధించిన ఆధారులు కూడా లభ్యం కావడంతో శనివారం ఆయన్ని విచారణకు పిలిచి 7 గంటల పాటు ప్రశ్నించింది. చివరికి తాజాగా అదుపులోకి తీసుకుంది. 

Also Read :  ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ

telugu-news | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు