Earthquake: ఒకేసారి మూడు భూకంపాలు.. పరుగులు తీసిన ప్రజలు

ఉత్తరాఖండ్‌, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లలో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని ఉత్తరాఖండ్‌ చమోలిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

New Update
earthquake

Earthquake

ఉత్తరాఖండ్‌, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లలో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారతదేశంలోని ఉత్తరాఖండ్‌ చమోలిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఆఫ్ఘనిస్తాన్‌లో 

ఉత్తరాఖండ్‌‌తో పాటు శనివారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస భూ ప్రకంపనలు సంభవించాయి. వరుసగా భూమి మూడుసార్లు కంపించింది.మొదటి భూకంపం తీవ్రత 4.6గా నమోదు. తెల్లవారుజామున 1:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత 4.2గా నమోదైంది. రెండవ భూకంపం తెల్లవారుజామున 2:11 గంటలకు సంభవించింది. దీని తీవ్రత  రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. అయితే మొదటి భూకంపం కంటే ఇది కొంచెం తక్కువగా ఉంది. వరుసగా మూడు భూకంపాలు ప్రజల్లో భయాందోళనలను సృష్టించాయి. 

మయన్మార్‌లో 

మయన్మార్‌లో శనివారం తెల్లవారుజామున 3:26 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదైంది. కాగా దీనికి ఒక రోజు ముందు.. మయన్మార్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పుడు మరోసారి భూమి కంపించడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు