HYD Rain
HYD Rain: హైదరాబాద్‌లో వర్షానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలిచౌకి, ఫిలింనగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అపోలో రోడ్డులో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వరుసగా కురుస్తున్న వర్షాలు, ట్రాఫిక్ సమస్యలు కలసి నగరవాసులను తిప్పలు పెట్టాయి. మెహదీపట్నం రోడ్డులోనూ భారీగా వాహనాల రద్దీ కనిపించింది. రోడ్డంతా వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ కదలకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారు.
వర్షాలతో ట్రాఫిక్ జాం ..
ఇదే సమయంలో నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, బేగంబజార్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, మెట్టుగూడ, బేగంపేట్, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం మొదలవడంతో పద్మనగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన కారణంగా అక్కడి ప్రజలు వర్షం పడినప్పుడల్లా భయాందోళనలో గడుపుతున్నారు.
ఇది కూడా చదవండి: మోకాలి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? ఉపశమనం పొందడానికి ఈ నివారణ ట్రై చేయండి
శుక్రవారం కురిసిన కుండపోత వానకు పలు ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. నగరంలోని ఓ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కూలిపోయింది. రిటైనింగ్ వాల్ కూలిన ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. కూలిన గోడ వల్ల దగ్గరలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ భవనం పునాదులు బయటపడిపోయాయి. దాదాపు రెండు ఫీట్ల మేర భవనం కింద భాగం కొట్టుకుపోయింది. వర్షపు నీరు ఇంకా పెరిగితే నాలా ప్రవాహం ఉధృతమయ్యే అవకాశం ఉంది. నాలాలో నీటి ప్రవాహం పెరిగితే ఆ భవనం పూర్తిగా నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నవారు భయాందోళనతో గడుపుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వారు భద్రతా లోపాల వల్ల వెంటనే ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: జంతువులు అనారోగ్యంగా ఉన్నప్పుడు తమను తాము ఎలా చూసుకుంటాయో తెలుసా..?
( hyd-rain | weather | Latest News | telugu-news | rain)