AP Crime : భార్యను వెంటాడి వేటాడి గొంతు కోసి చంపి..  ఆపై భర్త ఏం చేశాడంటే!

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. 15ఏళ్ల క్రితం లోకేశ్వర్‌తో ఉషకు వివాహం జరిగింది.

New Update
wife

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. 15ఏళ్ల క్రితం లోకేశ్వర్‌తో ఉషకు వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లులున్నారు. కరకంబాడిలోని అమర రాజా ఫ్యాక్టరీలో ఉష పనిచేస్తుంది. మొదట్లో  సజావుగానే సాగిన వీరి కాపురలో విభేదాలు తలెత్తాయి. ఉషపై అనుమానంతో లోకేశ్వర్ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.  గత నెల 30న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో పిల్లల్ని తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో దీన్ని జీర్ణించుకోలేని లోకేశ్వర్ తన భార్యను హతమార్చేందుకు ప్లాన్ చేశాడు.

డ్యూటీకి వెళ్లేందుకు

అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఉష కంపెనీ బస్సు కోసం వెళుతుండగా భర్త లోకేశ్వర్ అకస్మాత్తుగా ఆమెపై దాడి చేశాడు.. అతని నుంచి తప్పి్ంచుకునేందుకు ప్రయత్నించిన ఉషను వెంబడించి మరి కత్తితో గొంతుకోసి చంపేశాడు.  అనంతరం నేరుగా ఇంటికెళ్లి ఉరేసుకున్నాడు లోకేశ్వర్. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలిపోయారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు