/rtv/media/media_files/2025/07/19/pakistan-monsoon-rains-kill-63-in-24-hours-2025-07-19-08-05-32.jpg)
Pakistan monsoon rains kill 63 in 24 hours
పాకిస్థాన్‌లో వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన కుండపోత వర్షాలు, వరదల కారణంగా కనీసం 63 మంది మరణించగా, 290 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రకటించింది.
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
Pakistan monsoon rains
అయితే ఈ మరణాలలో ఎక్కువ భాగం తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో సంభవించాయి. ప్రధానంగా విద్యుదాఘాతం, భవనాలు కూలిపోవడం, ఆకస్మిక వరదల వల్ల ఈ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ చివరలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా తాజా మరణాలతో మృతుల సంఖ్య దాదాపు 180కి చేరుకుంది. మృతుల్లో సగానికి పైగా పిల్లలు ఉండటం మరింత విషాదం.
Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
పంజాబ్ ప్రావిన్స్ లో బుధవారం నుంచి ప్రారంభమైన భారీ వర్షాలు నిరంతరంగా కురుస్తుండటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రావల్పిండి నగరంలో ఉన్న నుల్లా లాయ్ నది పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం అత్యధికంగా పెరగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు.
ప్రభుత్వ సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని, ప్రజలు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సహాయక బృందాలు వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలను ఉపయోగిస్తుండగా, సైనిక హెలికాప్టర్లు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సహాయక సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.