/rtv/media/media_files/2025/07/19/married-woman-commits-suicide-due-to-extramarital-affair-in-kuppam-2025-07-19-07-04-18.jpg)
Married woman commits suicide due to extramarital affair in Kuppam
ఏపీలో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో పలు సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే ఆ వివాహిత సూసైడ్ చేసుకుందని తెలిపారు. ఈ ఘటన కుప్పంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
కుప్పంలో దారుణం
కుప్పం మండలానికి చెందిన 25 ఏళ్ల ఓ వివాహితకు సత్యవేలు అనే వ్యక్తితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ మధ్య సత్యవేలు ఆ వివాహితను కాస్త పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె సత్యవేలుకు వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు పెట్టింది. ‘‘ఈ మధ్య ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు’’ అని అడిగింది. దానికి సత్యవేలు రిప్లై ఇస్తూ ‘‘ఎప్పుడూ నీతోనే ఉండాలా?.. నా భార్యకు హెల్త్ బాలేదు.. హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి’’ అంటూ సమాధానం ఇచ్చాడు.
Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
ఆ మెసేజ్‌కు వివాహిత స్పందించి ‘‘నీకు నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా?.. నేను చనిపోతున్నా’’ అంటూ రిప్లై ఇచ్చింది. ఇదే విషయాన్ని కుప్పం అర్బన్ సీఐ తెలిపారు. అనంతరం వివాహిత మృతికి కారణమైన సత్యవేలుపై కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆపై మృతురాలి కుటుంబ సభ్యులు కూడా కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. సత్యవేలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.