Fish Venkat : వందకు పైగా సినిమాల్లో నటన..చివరి క్షణాల్లో పట్టించుకోని టాలీవుడ్‌

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్‌ ఫిష్‌ వెంకట్‌ తుదిశ్వాస విడిచారు. ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాయన.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. అయితే ఆయన మృతిని టాలీవుడ్‌ పట్టించుకోకపోవడం మరింత బాధకరంగా మారింది.

New Update
fish venkat

Fish Venkat

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్‌ ఫిష్‌ వెంకట్‌ తుదిశ్వాస విడిచారు. ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాయన.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. అయితే ఆయన మృతిని టాలీవుడ్‌ పట్టించుకోకపోవడం మరింత బాధకరంగా మారింది. వందకుపైగా సినిమాల్లో ఎంతోమంది సీనియర్‌ యాక్టర్స్‌తో ఫిష్‌ వెంకట్‌ నటించారు. కానీ ఆయన మృతిపై ఒక్కరూ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Also Read : ఆదిలాబాద్‌లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్.. భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం

Tollywood Ignore Fish Venkat

ఎన్నో సినిమాల్లో తనదైన శైలి కామెడీతో అలరించి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్‌ వెంకట్‌. ముఖ్యంగా హైదరాబాద్ యాసలో నవ్వులు పూయించారు. విలన్స్ గ్యాంగ్ లో కమెడియన్ గా రాణించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందకు పైగా సినిమాల్లో నటించారు. పెద్ద పెద్ద నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్ వంటి స్టార్‌ హీరోస్‌ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. 2002లో ఆది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఫిష్‌ వెంకట్‌.. ఆ సినిమాలో ఒక్కసారి తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో ఫేమస్‌ అయ్యారు. దీంతో అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీలో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత వీవీ వినాయక్‌ డైరెక్షన్‌లో చాలా సినిమాల్లో నటించారు. 

Also Read: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు జవాన్లు మృతి

ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. పుట్టకతోనే నిరుపేద అయిన ఫిష్ వెంకట్.. పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి ముషీరాబాద్ మార్కెట్‌లో చేపలు అమ్మి తల్లిదండ్రులకు అండగా ఉండేవారు. దీంతో తన వ్యాపారమే తన ఒంటి పేరుగా మారిపోయింది. 1991లో జంతర్‌ మంతర్‌ అనే చిత్రంలో వెంకట్‌కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆది సినిమాలో ఫేమస్‌ అయిన వెంకట్‌... వరుసగా మంచి సినిమాల్లో నటించారు. ఆది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బన్నీ, నాయక్‌, అదుర్స్, ఆంజనేయులు.. ఇలా 100కు పైగా సినిమాల్లో హాస్య నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినీ ప్రియులను అలరించారు. చివరిగా కాఫీ విత్ కిల్లర్ అనే సినిమాలో నటించారు.

Also read: ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్

ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఫిష్‌ వెంకట్‌కు.. కష్టసమయాల్లో టాలీవుడ్‌ ఆసరాగా నిల్వలేకపోయింది. కిడ్నీ సమస్యతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వెంకట్ కు డయాలసిస్ ట్రీట్ మెంట్ జరిగింది. అయితే కిడ్నీల మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. అందుకు కావాల్సిన ఖర్చు కోసం వెంకట్‌ కుటుంబ సభ్యులు దాతల సాయం కోరారు. కానీ టాలీవుడ్‌ నుంచి ఫిష్‌ వెంకట్‌కు సహాయం అందలేదు. కేవలం గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్‌, హీరో విశ్వక్‌ సేన్‌ వంటి పలువురు తమవంతు ఆర్థిక సాయం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రెండు లక్షల వరకు సాయం అందించారు. కానీ మిగతవారెవరూ ఆయన్ను పట్టించుకోలేదు. కనీసం ఆయన చనిపోయినప్పుడు కూడా చివరిచూపునకు ఏ ఒక్క హీరో వెళ్లలేదు. కుటుంబ సభ్యులనూ పరామర్శించలేదు.

Also Read : మోకాలి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? ఉపశమనం పొందడానికి ఈ నివారణ ట్రై చేయండి

ఇటీవలే కోటా శ్రీనివాసరావు చనిపోయినప్పుడు ఎంతోమంది సీనియర్ నటులు స్పందించారు. కానీ ఇప్పుడు ఫిష్ వెంకట్ మృతిని టాలీవుడ్ పెద్దలు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చావు విషయంలో ఎవరైనా ఒకటే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇది కూడా చూడండి:IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు

fish venkat passed away | fish venkat news | fish venkat no more | fish venkat health news | Actor Fish Venkat Health | comedian fish venkat

Advertisment
Advertisment
తాజా కథనాలు