/rtv/media/media_files/2025/07/16/chandu-2025-07-16-12-10-04.jpg)
chandu nayak murder
హైదరాబాద్‌లో సీపీఐ నాయకుడు కేతావత్ చందు నాయక్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈనెల 15న మలక్‌పేట పరిధిలోని శాలివాహననగర్ పార్కులో చందునాయక్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితులు మొత్తం తొమ్మిది మంది కాగా, ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో రాజేశ్ అలియాస్ రాజన్న, ప్రశాంత్, ఏడుకొండలు, కందుల సుధాకర్, రాయుడు, మున్నా అలియాస్ మహమ్మద్ మున్నా, రవీంద్రాచారి, యాదిరెడ్డిలు ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి సౌత్ ఈస్ట్‌జోన్ DCP చైతన్య కీలక విషయాలు వెల్లడించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందూ హత్య జరిగిందని అన్నారు. నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈనెల 14న చందూనాయక్‌ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. రెక్కీలో భాగంగానే ఉప్పల్ భగాయత్‌లో రూమ్ తీసుకున్నారన్నారు. పక్కా ప్లాన్‌తో హత్య చేశారు. జనగామలో రాజన్నను అదుపులోకి తీసుకున్నాం. గతంలో రాజన్నకు మావోయిస్టులతో సంబంధాలున్నాయి. ఘటనా స్థలంలో లభ్యమైన రెండు తుపాకులు రాజన్నవే అని సౌత్ ఈస్ట్‌జోన్ DCP చైతన్య స్పష్టం చేశారు.
Also Read: డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు
Chandu Naik Murder
చందునాయక్ సీపీఐ స్టేట్ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్నారన్నారు. ఈ కేసులో దొంతి రాజేశ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు. కాల్పులకు ముందు రోజు నిందితులు రెక్కీ కూడా నిర్వహించారు. చందునాయక్‌కు రాజేశ్‌తో విభేదాలున్నాయి. ఇద్దరూ భూదాన్ భూముల్లో సీపీఐ తరఫున పేదలతో గుడిసెలు వేయించారన్నారు. ఆ తర్వాత వారికి పట్టాలు ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. రాజేశ్ కూడా తన తరఫున కొందరితో గుడిసెలు వేయించాలని భావించాడు. గుడిసెలు వేయించేందుకు రాజేశ్ 1300 మంది నుంచి డబ్బులు వసూలు చేశాడన్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. ఇద్దరు కలసి ఒక బిల్డర్ వద్ద రూ.12 లక్షలు వసూలు చేశారని వివరించారు. సెటిల్‌మెంట్ ద్వారా వచ్చిన డబ్బు తనకు ఇవ్వలేదని, పార్టీకి దూరం చేశాడని కూడా రాజేశ్ కోపం పెంచుకున్నాడని తెలిపారు.
Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'
అలా రాజేశ్, ఐదుగురు ముఠా సభ్యులు కలిసి మలక్‌పేట పార్కు వద్దకు చేరుకున్నారు. తుపాకులతో పాటు కారం, కత్తులు కూడా కారులో పెట్టుకొని వచ్చారు. తుపాకులు విఫలమైతే కత్తులతో నరికేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కాల్పుల తర్వాత ఉప్పల్ భగాయత్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కోదాడకు వెళ్లారు. రాత్రి కావలి చెక్‌పోస్టు వద్ద కొందరు నిందితులను పట్టుకున్నాం. మరికొందరు నిందితులను జనగామ చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నాం. నిందితుల నుంచి 2 నాటు తుపాకులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నాం’’ అని డీసీపీ చైతన్య వెల్లడించారు.
Also Read : ఆ ఒక్క అలవాటే ఫిష్ వెంకట్ కొంప ముంచింది.. షాకింగ్ నిజాలు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్!
Also Read : ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి
gun fire in hyderabad | Gun Fire Incident | Malakpet Incident | malakpet cpi leader incident | malakpet firing | Malakpet