Dementia Symptoms: ముసలి వాళ్ళ చాదస్తానికి కారణం ఈ జబ్బే..!

డిమెన్షియా అనేది మెదడు పనితీరు క్రమంగా తగ్గిపోయే రుగ్మతి. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు ఆల్జీమర్స్ ప్రధాన కారణం. దీనిని పూర్తిగా నయం చేయలేకపోయినా, చికిత్సల ద్వారా నియంత్రించవచ్చు.

New Update
Dementia Symptoms

Dementia Symptoms

Dementia Symptoms: నేడు ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యంలో ప్రధానంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో డిమెన్షియా ఒకటి. మనం ముసలి వాళ్ళ చాదస్తం(Dementia in Elders) అనే మాట వినే ఉంటాం , నిజానికి ఇది సాధారణంగా పెద్దవారిలో మానసిక నిలకడ కోల్పోవడం మాత్రమే కాదు మెదడు పనితీరులో గణనీయమైన మార్పులు కలగడం వల్ల ఏర్పడే వ్యాధి.

Also Read: ఫిష్ వెంకట్ చేసిన బెస్ట్ కామెడీ మూవీస్ ఇవే.. మీరూ చూశారా?

డిమెన్షియా అంటే ఏమిటి? (What is Dementia)

డిమెన్షియా అనేది ఒక రకం మెదడు వ్యాధి. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన, భాషా నైపుణ్యం, జీవిత సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఈ వ్యాధి కనిపించవచ్చు. అయితే, ఇది వృద్ధాప్యానికి సంబంధించిన సహజ ప్రక్రియ కాదని గమనించాలి.

Also Read: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్

డిమెన్షియా వచ్చే ప్రధాన కారణాలు..

డిమెన్షియా అనేక రకాలుగా ఉండవచ్చు ముఖ్యంగా:

ఆల్జీమర్స్ వ్యాధి (Alzheimer's Disease): ఇది డిమెన్షియాకు ప్రధాన కారణం. మెదడులో సెల్స్ క్రమంగా మరణించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది(Memory Loss).

వాస్కులార్ డిమెన్షియా (Vascular Dementia): మెదడుకు రక్తప్రవాహం తక్కువగా ఉండటం వల్ల కలిగే డిమెన్షియా.

లూయీ బాడీ డిమెన్షియా (Lewy Body Dementia): మెదడులో నార్మల్ ప్రోటీన్ కణాలు పేరుకుపోవడం వల్ల కలిగే డిమెన్షియా .

ఫ్రంటోటెంపొరల్ డిమెన్షియా: ముందు, పక్క భాగాలలో గల మెదడు కణజాలం నశించటం వలన  కలిగే డిమెన్షియా.

ఇవే కాకుండా, కొన్ని ఇతర వ్యాధులు, మెదడు గాయాలు, మద్యం వ్యసనం, ఔషధాలు కూడా డిమెన్షియాకు దారితీయవచ్చు.

Also Read: ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. చేపలు అమ్ముకునే వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు?

ముఖ్య లక్షణాలు

డిమెన్షియా ప్రారంభ దశలో గుర్తించడం కష్టమే. కానీ కొన్ని ముఖ్య లక్షణాలను గమనించవచ్చు:

  • జ్ఞాపకశక్తి తగ్గడం
  • సరిగా మాట్లాడలేకపోవడం
  • ప్రవర్తన మారడం
  • రోజువారీ పనులు చేయడంలో తడబాటు
  • నిర్ణయం తీసుకోలేకపోవడం
  • సమయం, ప్రదేశం విషయంలో అయోమయం

ఈ లక్షణాలు మెల్లగా పెరిగిపోతూ జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైలోనైనా మిథున్‌రెడ్డి అరెస్టు!

డిమెన్షియా చికిత్స

ప్రస్తుతం డిమెన్షియాకు పూర్తిగా నయం చేసే ఔషధం లేదు. కానీ లక్షణాలను నియంత్రించేందుకు కొన్ని విధానాలు ఉన్నాయి:

ఔషధాలు: ఆల్జీమర్స్ కోసం కొన్ని మెమరీ-ఎన్‌హాన్స్ చేసే మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి.

సైకాలజికల్ థెరపీ: టాక్ థెరపీ, మానసిక ఉత్తేజం కోసం చికిత్సలు.

అయితే ఈ సమస్యకు కుటుంబ సభ్యులు ఓర్పుతో, ప్రేమతో స్పందించాలి. ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం కూడా ఎంతో అవసరం. కాబట్టి పెద్దలను ప్రేమతో చూసుకోవడం, వైద్యుల సలహాతో ముందస్తుగా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

Advertisment
Advertisment
తాజా కథనాలు