/rtv/media/media_files/2025/06/21/indigo-flight-2025-06-21-18-35-43.jpg)
IndiGo Flight
ఇండిగో విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
IndiGo flight Fails To Land
ఇండిగో విమానం ఇవాళ (శనివారం) ఉదయం ముంబై నుంచి నాగ్‌పూర్‌కు బయల్దేరింది. అక్కడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఇబ్బంది పడింది. దారి సరిగా కనిపించకపోవడంతో పైలట్ సమయస్ఫూర్తి, అనుభవాన్ని ప్రదర్శించి విమానాన్ని మరోసారి గాల్లోకి తీసుకెళ్లారు.
Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
🚨 🚨 #BreakingNews Mumbai-Nagpur Flight Causes Panic As It Fails To Land In First Attempt Due To Low Visibility https://t.co/xWPo4Yqo3s
— Instant News ™ (@InstaBharat) July 19, 2025
IndiGo flight 6E 5349 failed to land at the Nagpur airport on the first attempt due to poor visibility. The pilot made another attempt in 1…
ఇలా దాదాపు 15 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే పైలట్ ఆ విమానాన్ని మరోసారి కిందికి తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే విజిబిలిటీ తక్కువగా ఉన్న కారణంతోనే ఇలా జరిగిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా దీని వల్ల మరిన్ని విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. .