/rtv/media/media_files/2025/07/19/boy-died-after-food-piece-stuck-in-throat-2025-07-19-09-59-13.jpg)
Boy died after food piece stuck in throat
ఏపీలోని అనంతపురం జిల్లా తపోవనంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దోసె ముక్క గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే..
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
ప్రాణం తీసిన దోశ
అనంతపురం నగరం తపోవనం ప్రాంతానికి చెందిన అభిషేక్, అంజినమ్మలకు రెండేళ్ల కుమారుడు కుశాల్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం కుశాల్ దోసె తింటున్నాడు. ఈ క్రమంలో దోసె ముక్క అనుకోకుండా అతని గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.
Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
కుశాల్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో, తల్లిదండ్రులు వెంటనే సర్వజనాసుపత్రికి తరలించగా.. కొద్ది సేపటికే బాలుడు మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన తపోవనం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు నిశితంగా పర్యవేక్షించాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు