Christopher Nolan's The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ "ది ఒడిస్సీ" రికార్డుల మోత.. రిలీజ్ కి సంవత్సరం ముందే హౌస్‌ఫుల్!!

క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న "ది ఒడిస్సీ" ఐమ్యాక్స్ 70mm టికెట్లు విడుదలైన గంటలోనే 95% అమ్ముడై రికార్డు సృష్టించింది. 2026లో విడుదల కానున్న ఈ మూవీ పూర్తిగా ఐమ్యాక్స్ ఫిల్మ్ కెమెరాలతో షూట్ అవుతోంది.

New Update
Christopher Nolans The Odyssey

Christopher Nolans The Odyssey

Christopher Nolan's The Odyssey:

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా "ది ఒడిస్సీ"(The Odyssey) ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. సినిమా విడుదలకి ఇంకా సంవత్సరం ఉండగానే, స్పెషల్  ఐమ్యాక్స్ 70mm టికెట్లు(The Odyssey IMAX 70MM Tickets) కేవలం ఒక గంటలోనే సోల్డ్ అవుట్ అయ్యాయి. 

ఈ మూవీని 2026 జూలై 17 నుండి 19 వరకు అన్ని షోలకు సంబంధించి టికెట్ల వివరాలను 2025 జూలై 18 అర్ధరాత్రి ఐమ్యాక్స్ వారి సోషల్ మీడియా ద్వారా ముందుగానే తెలపడంతో, భారీ స్పందన లభించింది. ప్రారంభ ప్రివ్యూలు జూలై 16 నుండే జరుగనున్నాయని సమాచారం. అమెరికాలోని సుమారు 25-26 ఐమ్యాక్స్ 70mm థియేటర్లలో ఈ మూవీ స్పెషల్ షోస్ జరుగుతాయి.

Also Read:ఫిష్ వెంకట్ చేసిన బెస్ట్ కామెడీ మూవీస్ ఇవే.. మీరూ చూశారా?

నోలన్ ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ రేంజ్ లో షూట్ జరుపుకుంటున్న మొదటి కమర్షియల్ చిత్రం ఇదే కావడం విశేషం. అయితే టికెట్లు విడుదలైన  గంటలోనే 95% సీట్లు అమ్ముడుపోవడంతో సినిమా మీద ఎంతటి అంచనాలు ఉన్నాయో అర్థమవుతోంది.

న్యూయార్క్ లోని AMC లింకన్ స్క్వేర్ 13, లాస్ ఏంజిల్స్ లోని యూనివర్సల్ సిటీవాక్, ఒరేంజ్ కౌంటీలోని రెగల్ ఇర్విన్ స్పెక్ట్రం లాంటి ప్రముఖ ఐమ్యాక్స్ లొకేషన్లు ఇప్పటికే పూర్తిగా సోల్డ్ అవుట్ అయ్యాయి. అలాగే ఫ్లోరిడా, జార్జియా, ఇండియానా, పెన్సిల్వేనియా, టెక్సాస్ లాంటి ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో కూడా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కెనడాలోని టొరంటోలో ఉన్న ప్రముఖ ఐమ్యాక్స్ థియేటర్లు కూడా రికార్డు స్థాయిలో ఈ మూవీ టికెట్లను అమ్మాయి.

Also Read:అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్

లండన్‌లోని BFI ఐమ్యాక్స్, మెల్బోర్న్, చెక్ రిపబ్లిక్ లాంటి అంతర్జాతీయ ప్రదేశాల్లో కూడా "ది ఒడిస్సీ" టికెట్లు ఇప్పటికే రికార్డు స్థాయిలో బుక్కయ్యాయి. గతంలో నోలన్ తీసిన “ఒప్పెన్‌హైమర్” 975 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, అందులో 190 మిలియన్లు ఐమ్యాక్స్ ద్వారానే వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సారి "ది ఒడిస్సీ" బడ్జెట్ సుమారు 250 మిలియన్ డాలర్లు కాగా, ఇది నోలన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ కానుంది. ఈ చిత్రంలో మాట్ డేమన్, టామ్ హోలండ్, అనీ హ్యాథవే, జెండాయా, లుపిటా నైఒంగో, రాబర్ట్ పాటిన్‌సన్, చార్లీస్ థెరాన్, మియా గోత్ వంటి నటీ నటులు నటిస్తున్నారు.

Also Read:ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. చేపలు అమ్ముకునే వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు?

హోమెర్ రచించిన గ్రీకు కావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ట్రోజన్ యుద్ధం తరువాత ఇథాకా రాజు ఒడిసియస్ తన భార్య పెనెలోపి వద్దకు తిరిగి చేరుకోవడానికి తీసుకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని చూపుతుంది. ఈ ప్రయాణంలో ఒడిసియస్ సైక్లోప్స్ పాలిఫిమస్, సిరెన్స్, చార్మింగ్ సిర్సె లాంటి అనేక మిథాలజికల్ ప్రాణులను ఎదుర్కొంటాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నా, ఇప్పటికే ఈ స్థాయి క్రేజ్ ఉండడం నోలన్ సినిమాలకి ఉన్న మార్కెట్ రేంజ్ ఏంటో తెలియజేస్తోంది. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Also Read:వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైలోనైనా మిథున్‌రెడ్డి అరెస్టు!

    Advertisment
    తాజా కథనాలు