Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు స్పాట్‌ డెడ్ - తండ్రి, ఇద్దరు కొడుకులు సహా..!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధుర జిల్లాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు.

New Update
uttar pradesh tragic accidents six killed on yamuna expressway in mathura

Tragic Accident

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధుర జిల్లాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

మొదటి ప్రమాదం:

మొదటి ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో సరాయ్ సల్వాన్ గ్రామానికి సమీపంలోని బలదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నోయిడా నుండి ఆగ్రాకు వెళ్తున్న ఈకో వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల.. అది అదుపుతప్పి ముందు వెళ్తున్న ఒక భారీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 

Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

మృతులలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ధర్మవీర్ సింగ్, అతని ఇద్దరు కుమారులు రోహిత్, ఆర్యన్ ఉన్నారు. ధర్మవీర్ భార్య సోని, కుమార్తె పాయల్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని మోరెనాకు చెందిన దల్వీర్, పారస్ తోమర్, రోహిత్ స్నేహితుడు ఉన్నారు. ఇక ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయ్యింది. 

రెండో ప్రమాదం:

అదే యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సుమారు అరగంట తర్వాత, అంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ బస్సు ప్రమాదానికి కూడా డ్రైవర్ నిద్రమత్తే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు