బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని, సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. శనివారం గాంధీభవన్ లో మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మైనంపల్లి మండిపడ్డారు. నరం లేని నాలుక మాదిరి కేటీఆర్ అహంకారపూరిత మాటలున్నాయన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల ఆరాచక పాలనపై ఓ బుక్ రాసి గడప గడపకు పంచుతానని తెలిపారు. కేటీఆర్ జైలు ఊసలు లెక్కపెట్టడం ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ పెద్ద మనసుతో
ఇంటికి ఇంటికి ఉద్యోగం,దళిత సీఎం, దళితులకు భూములు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారని, డబుల్ బెడ్ రూం అంటూ కాలయాపన చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పెద్ద మనసుతో డబుల్ బెడ్ రూమ్ కట్టిన వాళ్ల కోసం రూ.9 వేల కోట్లు నిధులు కేటాయించాటారని తెలిపారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేయడమే కేటీఆర్ పని మైనంపల్లి ఆరోపించారు. ఎక్కువ మాట్లాడితే బావ ,బామ్మర్ధుల బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిలబెడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం గుర్తుపెట్టుకోవాలన్నారు. కేటీఆర్, హరీష్ రావు అవసరమైతే మీ ఇళ్లపై దాడులు చేస్తామని తెలిపారు.
Mynampally : బట్టలిప్పి నడిరోడ్డు మీద నిలబెడతా... కేటీఆర్ కు మైనంపల్లి వార్నింగ్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని, సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు.