/rtv/media/media_files/2025/07/19/midhun-reddy-2025-07-19-06-50-35.jpg)
ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో సిట్ అధికారులు అలెర్ట్ అయ్యారు శుక్రవారమే విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాల్ని దానికి అనుబంధంగా సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఆ మెమో రిటర్న్ చేయటంతో వాటిని సమర్పించారు. దీంతో మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా సిట్ ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీ చేసింది.
సిట్ ఎదుట లొంగిపోతారనే ప్రచారం
మరోవైపు శనివారం మధ్యాహ్నం మిథున్ రెడ్డి సిట్ ఎదుట లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఉదయం 9.30 గంటలకి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఎంపీ మిథున్ రెడ్డి ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ఏ క్షణమైనా ఆయనను సిట్ అరెస్ట్ వేసే అవకాశం ఉంది. కాగా నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిట్ అనుమతి కోరగా.. కేసు కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.