/rtv/media/media_files/2025/07/19/hari-hara-veera-mallu-2025-07-19-16-09-32.jpg)
Hari hara veera mallu
స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ జులై 24వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
#HariHaraVeeraMallu AP ticket rates for 1st 10 days :
— वीरा मल्लू 🦅 (@PA1Fann) July 19, 2025
₹297 - Single screens
₹377 - Multiplexes pic.twitter.com/MRgIYlWfTE
ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
రిలీజ్ అయిన మొదటి రెండు వారాలు..
సినిమా రిలీజైన మొదటి రెండు వారాలు రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి 10 రోజులు మాత్రమే రేట్లు పెంచడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 (లోయర్ క్లాస్) రూ.150 (అప్పర్ క్లాస్) పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక మల్టీప్లెక్స్‌లో రూ.200 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
ఇది కూడా చూడండి:IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు
ఇదెలా ఉండగా తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమాపై బెనిఫిట్ షోలు కూడా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4గంటల షోతో పాటు, విడుదలకు ఒకరోజు ముందు జులై 23న రాత్రి 9.30గంటలకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేసే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చూడండి:Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!
Hari Hara Veera Mallu | hari hara veera mallu movie | tickets