Adilabad: ఆదిలాబాద్‌లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్.. భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం

ఆదిలాబాద్‌లో జిమ్ నిర్వహిస్తున్న షేక్ ఆదిల్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు తన దగ్గరికి వచ్చే ట్రైనర్స్‌కి కూడా ఇస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతని జిమ్‌లో భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
drugs

Drugs

ఆదిలాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఓ జిమ్ ఓనర్ యువకులకు డ్రగ్స్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆ జిమ్‌ను సీజ్ చేయడంతో పాటు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌లో షేక్ ఆదిల్  లయన్ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. తాను డ్రగ్స్ తీసుకోవడంతో పాటు తన దగ్గరికి వచ్చే వారికి కూడా షేక్ ఆదిల్ డ్రగ్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఇది కూడా చూడండి:IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు

ఇంజెక్షన్లు కూడా..

అతని జిమ్‌లో పోలీసులు 20 ఎంఎల్ ఏఎంపి ఇంజక్షన్ బాటిల్, మూడు ఇంజక్షన్లు, 36 స్టెరాయిడ్స్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సర్జరీకి వాడే డ్రగ్ 3 ఇంజెక్షన్లు కూడా లభ్యమయ్యాయి. స్టెరాయిడ్ టాబ్లెట్లను జిమ్‌కు వచ్చే వారికి ఇచ్చి అనారోగ్యం బారిన పడేలా చేసినందుకు షేక్‌పై ఆదిలాబాద్ పోలీసులు 334/25 అండర్ సెక్షన్ 125 BNS 27 (B)(ii) DCA యాక్ట్‌తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి:Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!

adilabad | adilabad crime | adilabad crime latest | adilabad crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు