Fish venkat : ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. చేపలు అమ్ముకునే వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు?

ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. ఆయన ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేసేవాడు. అందుకే అందరూ ఆయన్ను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో 1971 ఆగస్టు 3న జన్మించారు.

New Update
fish-venkat

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.  ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించినా, దానికి అవసరమైన ఆర్థిక సహాయం లభించకపోవడం, సరైన దాతలు దొరకకపోవడం విషాదకరం. రక్తపోటు (బీపీ), షుగర్ కూడా అదుపులో లేకపోవడంతో ఇతర అవయవాలు కూడా దెబ్బతిని ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని తెలిసింది. 

అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్

ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. ఆయన ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేసేవాడు. అందుకే అందరూ ఆయన్ను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో 1971 ఆగస్టు 3న జన్మించారు. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వెంకట్ కు సినిమాలంటే చాలా ఇష్టం. దివంగత నటుడు  శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు. దర్శకుడు వి.వి.వినాయక్ ఆయన్ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. వి.వి.వినాయక్‌ను తన గురువుగా భావిస్తారు. 

ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో "ఒక్కసారి తొడకొట్టు చిన్నా" అనే డైలాగ్‌తో బాగా పాపులర్ అయ్యారు ఆయన 100కు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలలో నటించారు.  ఏపీలో పుట్టినప్పటికీ హైదరాబాద్ లో పెరగడంతో ఆయనకు తెలంగాణ యాస బాగా వచ్చు. తెలంగాణ  యాసతో  కూడిన కామెడీ, విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. కొంతకాలంగా కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్న వెంకట్.. . 2025 జూలై 18వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 53 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయనకు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు తెలిపారు, అయితే దాతలు దొరకలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు