AP Crime : ఐ లవ్ యూ.. అమ్మా అంటూ.. ప్రాణం తీసుకున్న యువకుడు

అమ్మా ఐ యామ్ వెరీ సారీ..ఇక నీ కొడుకు లేడమ్మా..జాగ్రత్తగా ఉండు..మళ్లీ వస్తాను..చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు..ప్లీజ్ మా...ఐ మిస్ యూ మా... లవ్ యూ మా...అంటూ తల్లికి వీడియో కాల్ చేసి ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
Young man suicide

Young man suicide

AP Crime : తల్లి కన్నీళ్లకైనా..నీ మనసు కరగకపోయెనా..అమ్మ వెళ్లి.. వస్తానని అమ్మకే చెప్తావా..అమ్మ గుండె ఎంతగా తల్లడిల్లిందో..ఒక్కసారైనా ఆలోచిస్తివా తల్లి కన్నీళ్లకైనా..నీ మనసు కరగకపోయెనా..చేతులెత్తి వేడుకున్నా.. వినకపోతివా..ఐ లవ్ యూ.. అమ్మా.. అంటూ ప్రాణం తీసుకుంటావా.. ఇంతకన్నాశిక్ష ఏముంటుంది కన్నా అంటూ ఆ తల్లి రోదిస్తు్న్న తీరు అక్కడి వారందరినీ కలచివేసింది. తల్లికి వీడియో కాల్‌ చేసి మరీ ఊరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

Also Read : ఆదిలాబాద్‌లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్.. భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం

Young Man Took Suicide

అమ్మా ఐ యామ్ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా.. జాగ్రత్తగా ఉండు.. మళ్లీ వస్తాను.. చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు.. ప్లీజ్ మా... ఐ మిస్ యూ మా... లవ్ యూ మా... అంటూ తల్లికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి, వద్దని వేడుకుంటున్నా.. కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నా వినకుండా.. తల్లి చూస్తుండగానే ఉరేసుకుని, మరణించాడు. కొడుకు మరణాన్ని చూసి తల్లి కుప్పకూలిపోయింది. అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బొమ్మలాటపల్లి వద్ద బ్రహంగారి గుడి వెనుక గుట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకుని మల్లికార్జున (23) మరణించాడు. నార్పల మండల పులసనూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ, మునీశ్వరి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మల్లికార్జున. ఇంటర్ వరకు చది వాడు. అనంతపురంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండేవాడు. తాను చనిపో తున్నానని శుక్రవారం తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. అనంతరం తల్లి మునీశ్వరికి వీడియో కాల్ చేసి లైవ్లోనే చెట్టుకు ఉరేసు కుని, చనిపోతున్నానన్నాడు. తల్లి మునీశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. 'చనిపోవద్దు.. నాన్నా..' అని ప్రాధేయపడినా వినకుండా ఉరేసుకున్నాడు. దీంతో మునీశ్వరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

Also Read: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు జవాన్లు మృతి

వెంటనే కుటుంబీకులు.. నార్పల పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలోనే చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నార్పల పోలీసుల సమాచారంతో మృతదేహం మల్లికార్జునదిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Also read: ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్

Also Read :  భాగ్యనగర్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో వాహనదారుల అవస్థలు

commit-suicide | committed-suicide | driver-suicide | suicide | young-boys | anantapur | anantapur-district

Advertisment
Advertisment
తాజా కథనాలు