Prabhas - Samantha: దుమ్మురేపిన ప్రభాస్, సమంత.. ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్‌!

ఆర్మాక్స్ విడుదల చేసిన జూన్‌ నెల మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలో ప్రభాస్, సమంత టాప్ ప్లేస్‌లో నిలిచారు. అలాగే టాప్ 10లో టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు చోటు దక్కించుకోవడం విశేషం.

New Update
Prabhas - Samantha

Prabhas - Samantha

Prabhas - Samantha: దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులపై ప్రతినెల సర్వే నిర్వహించే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్(Ormax Stars India Loves) తాజాగా జూన్ 2025 నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోని స్టార్స్‌కి సంబంధించిన ఈ లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్స్ మరోసారి దుమ్ము రేపారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ సమంత ఈ జాబితాలో టాప్ స్థానాలు దక్కించుకోవడం విశేషం.

Also Read: ఫిష్ వెంకట్ చేసిన బెస్ట్ కామెడీ మూవీస్ ఇవే.. మీరూ చూశారా?

మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్ ఇదే(Most Popular Male Film Stars in India)..

పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ తాజా ర్యాంకింగ్స్‌ మరోసారి రుజువు చేశాయి. జూన్‌ నెలలో మోస్ట్ పాపులర్ మేల్ సెలబ్రిటీగా ప్రభాస్ తిరుగులేని స్థానం దక్కించుకున్నాడు. ప్రభాస్ తరువాత స్థానాన్ని తమిళ స్టార్ దళపతి విజయ్‌ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయ‌న సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను సంపాదిస్తున్నాయి.

Also Read: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్

మూడో స్థానం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దక్కింది. ‘పుష్ప’ సిరీస్‌తో ఆయన క్రేజ్ గ్లోబల్ లెవెల్‌కి చేరిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలవగా, తమిళ మాస్ హీరో అజిత్ కుమార్ ఐదో ప్లేస్‌ను దక్కించుకున్నారు.

తదుపరి స్థానాల్లో తెలుగు స్టార్స్ చోటు దక్కించుకున్నారు. మహేశ్ బాబు 6వ స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ 7వ స్థానంలో నిలిచారు. వీరి తర్వాత రామ్ చరణ్ 8వ స్థానంలో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 9వ స్థానంలో, నేచురల్ స్టార్ నాని 10వ స్థానం సాధించారు.

Also Read: ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. చేపలు అమ్ముకునే వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు?

మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్ ఇదే(Most Popular Female Film Stars in India).. 

ఫిమేల్ కేటగిరీలో మాత్రం సమంత అగ్రస్థానాన్ని దక్కించుకుంటూ మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది. ఎన్నో విమర్శలు, వ్యక్తిగత సమస్యల నడుమ కూడా సమంత కెరీర్‌పై చూపిస్తున్న పట్టుదల ఆమె క్రేజ్‌కు నిదర్శనం.

ఆమె తర్వాతి స్థానం బాలీవుడ్ స్టార్ అలియా భట్‌కు దక్కింది. మూడో ప్లేస్‌లో దీపిక పదుకొణె ఉండగా, నాలుగో స్థానాన్ని సీనియర్ బ్యూటీ త్రిష కైవసం చేసుకుంది. ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైలోనైనా మిథున్‌రెడ్డి అరెస్టు!

ఆ తరువాత స్థానం వరుసగా సాయిపల్లవి (6), నయనతార (7), రష్మిక మందన్న (8), కీర్తి సురేష్ (9), తమన్నా (10)లకు దక్కాయి. మొత్తం మీద టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్లు ఈ లిస్ట్‌లో ఎక్కువగా చోటు దక్కించుకోవడం గమనార్హం.

Advertisment