🔴LIVE BREAKINGS: టీచర్ల వేధింపులు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

LIVE BREAKINGS

  • Jul 26, 2025 18:29 IST

    Salaar 2 Update: 'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్

    'సలార్ 2' లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య పవర్‌ఫుల్ సన్నివేశాలు ఉండబోతున్నాయని పృథ్వీరాజ్ వెల్లడించారు. కథ, స్కోప్ గ్రాండ్ గా ఉంటుందనీ, ప్రభాస్‌తో తలపడేందుకు ఎదురు చూస్తున్నానని "సలార్ 2" గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు.

     

    Salaar 2 Update
    Salaar 2 Update

     



  • Jul 26, 2025 17:49 IST

    Hyderabad : వేరే వాడి వీర్యకణాలతో భార్యకు సంతానం .. బయపటపడ్డ టెస్ట్ ట్యూబ్ సెంటర్ బాగోతం!

    హైదరాబాద్ లో దారుణం జరిగింది. పిల్లల కోసం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించింది ఓ మహిళ. అయితే  తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరింది. అందుకు భిన్నంగా వైద్యురాలు ఆమె భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించింది.

    sperm



  • Jul 26, 2025 17:49 IST

    Dead Bodies Missing : శ్మశానవాటికలో శవాలు మిస్సింగ్.. పూడ్చి పెట్టిన కొన్ని రోజులకే!

    ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని మణినాథ్ పూర్ శ్మశానవాటికలో గత కొన్ని నెలలుగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాలు అదృశ్యమవుతున్నాయి. ఈ సంఘటనలు గ్రామస్తులలో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నాయి.

    dead body missing



  • Jul 26, 2025 17:49 IST

    Sobhan Babu: శోభన్‌ బాబుకు బ్లాంక్ చెక్‌ ఇచ్చా.. అతడులో ఆయన ఎందుకు నటించలేదంటే? : మురళీ మోహన్‌

    ఈ సినిమాలో నటుడు నాజర్ పోషించిన సత్యనారాయణ మూర్తి పాత్రను ముందుగా అలనాటి హీరో శోభన్ బాబుతో చేయించాలని అనుకున్నారట మురళీ మోహన్. ఆయన మేనేజర్‌కు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చి శోభన్ బాబు ఇంటికి కూడా పంపించారట.

    murali, shoban



  • Jul 26, 2025 17:48 IST

    BRSను BJPలో విలీనం చేస్తామనలేదా.. గుండెల మీద చేయి వేసి చెప్పు KTR : సీఎం రమేష్

    తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సంచలనల ఆరోపణలు చేశారు. కవితపై లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతామని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.

    cm ktr



  • Jul 26, 2025 17:47 IST

    Pawan Kalyan : పవన్ కల్యాణ్ను గట్టిగా పట్టుకున్న ఈ అమ్మాయి ఎవరంటే?

    ఈ సక్సెస్ మీట్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  ఈవెంట్ లో  ఓ పవన్ ఫ్యాన్ కమ్ నటి తన అభిమాన నటుడి కాళ్లు మెక్కి అతని చెయి పట్టుకుని ఫోటో దిగింది. ఆనందంతో గెంతులేసింది. ఆమె చర్యలతో పవన్ కూడా సిగ్గు పడిపోయారు.

    nivetha manoj



  • Jul 26, 2025 16:21 IST

    Prabhas Spirit Update: అరాచకం సామి ఇది.. సెప్టెంబర్ నుండి స్పిరిట్ నాన్ స్టాప్ కొట్టుడే..!

    ప్రభాస్ "ది రాజాసాబ్" తర్వాత "స్పిరిట్" షూటింగ్‌లోకి సెప్టెంబర్ చివరి వారంలో అడుగుపెడతారని డైరెక్టర్ సందీప్ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. షూటింగ్ స్టార్ట్ అయినా తర్వాత బ్యాక్ టు బ్యాక్ భారీ షెడ్యూల్స్ ఉండబోతున్నాయని వంగా క్లారిటీ ఇచ్చారు.

     

    Prabhas Spirit Update
    Prabhas Spirit Update

     



  • Jul 26, 2025 16:20 IST

    Saiyaara Collections: రికార్డులు క్రియేట్ చేస్తున్న 'సయ్యారా' కలెక్షన్స్..!

    అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన "సయ్యారా" ఎనిమిదో రోజుకే రూ.190.75 కోట్లు వసూలు చేసి, 2025లో టాప్ బాలీవుడ్ హిట్‌గా నిలిచింది. ఈ శనివారానికి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

     

    Saiyaara
    Saiyaara

     



  • Jul 26, 2025 14:04 IST

    టీచర్ల వేధింపులు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

    రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం జరిగింది. టీచర్ వేధింపుల తాళలేక ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

     

    Medical Student Dies By Suicide In Udaipur
    Medical Student Dies By Suicide In Udaipur

     



  • Jul 26, 2025 13:45 IST

    అమ్మో.. ప్రధాని మోదీ విదేశీ టూర్ల కోసం అన్ని వందల కోట్లా ?

    ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లేందుకు భారీగానే ఖర్చవుతోంది. 2021 నుంచి 2025 మధ్య ఆయన విదేశీ పర్యటనల కోసం ఏకంగా రూ.362 కోట్లు ఖర్చయ్యాయి. ఈ ఏడాదిలోనే ఆయన పర్యటనల కోసం ఏకంగా రూ.67 కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం.

     

    PM Modi
    PM Modi

     



  • Jul 26, 2025 13:44 IST

    నన్ను చంపేస్తారు..! గుక్కపట్టి ఏడుస్తున్న హీరోయిన్

    బాలీవుడ్ నటి తనుశ్రీ గత ఐదేళ్లుగా  తన సొంత ఇంట్లోనే  వేధింపులకు గురవుతున్నానని, తన ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ ఏడుస్తూ ఇటీవలే  సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

     

    Actor Tanushree Dutta
    Actor Tanushree Dutta

     



  • Jul 26, 2025 13:43 IST

    ఆ నిర్మాతను చెప్పుతో కొట్టిన హీరోయిన్..కారణం ఏంటంటే..

    ‘సో లాంగ్ వ్యాలీ’ చిత్ర నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్‌పై సీరియల్ హీరోయిన్ రుచి గుజ్జర్ చెప్పుతో దాడిచేసి కొట్టింది.ఈ మూవీ స్క్రీనింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో నిర్మాతపై గుజ్జర్‌ దాడిచేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    The heroine hit the producer with a shoe



  • Jul 26, 2025 12:52 IST

    పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..వందలాది మందితో...

    బీఆర్‌ఎస్‌ హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటివద్ద హై టెన్షన్‌ నెలకొంది. ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు బీఆర్‌ఎస్‌ , మరోవైపు కాంగ్రెస్‌ కార్యకర్తలతో ఆయన ఇంటి వద్ద హైడ్రమా కొనసాగుతోంది.

    High tension at Padi Kaushik Reddy's house



  • Jul 26, 2025 12:38 IST

    ఛీ.. ఛీ వీళ్లు మనుషులేనా.. పరీక్షకు హాజరైన యువతిపై అత్యాచారం..

    బిహార్‌లో దారుణం జరిగింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

     

    Bihar woman raped by 2 in moving ambulance after she fainted in Home Guard exam
    Bihar woman raped by 2 in moving ambulance after she fainted in Home Guard exam

     



  • Jul 26, 2025 12:13 IST

    ప్రియురాలిని వశీకరణం చేసుకునేందుకు గోడ దూకాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    ఏపీలోని తిరుపతి జిల్లాలో తను ప్రేమించిన యువతిని దక్కించుకోవాలనుకున్న ఒక యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. అది కూడా అర్థరాత్రి కానీ, అతని ప్రయత్నం విఫలమవ్వడమే కాకుండా జనం చేతిలో తన్నులు తిన్నాడు. మల్లయ్యపల్లిలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

    Lover Boy



  • Jul 26, 2025 11:29 IST

    TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

    ఇటీవల TRFను అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది. TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది.

     

    the resistance front
    the resistance front

     



  • Jul 26, 2025 11:29 IST

    ముంబయి ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు.. తీరా వెళ్లిచూస్తే ?

    ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామని.. త్వరలో భారీ పేలుడు జరగబోతోందని ఓ కాల్‌ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాంబు స్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టగా ఏమీ లేదని తేల్చారు.

     

    Mumbai airport
    Mumbai airport

     



  • Jul 26, 2025 10:21 IST

    హమాస్‌ చావాలనుకుంటుంది.. ఇజ్రాయెల్ పని పూర్తిచేయాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్‌ అంగీకరించలేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ గాజాలో తమ సైనిక చర్యలను మరింత ఉద్రిక్తం చేసి పనిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.

     

    Trump
    Trump

     



  • Jul 26, 2025 09:35 IST

    నంబర్.1 గా మోదీ.. దారుణంగా పడిపోయిన ట్రంప్.. తాజా సర్వేలో సంచలన విషయాలు!

    ప్రపంచ దేశాధినేత ర్యాంకింగ్‌ లిస్ట్‌లో భారత ప్రధాని మోదీ మరోసారి టాప్‌ 1 లో నిలిచారు. 'డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్‌' జాబితాలో 75 శాతం ఓటింగ్‌తో మొదటి స్థానం సాధించారు.

     

    PM Modi tops list of global leaders with 75% approval, Trump ranks 8th, Survey
    PM Modi tops list of global leaders with 75% approval, Trump ranks 8th, Survey

     



  • Jul 26, 2025 09:34 IST

    భర్తపై అనుమానం.. పుట్టింటికి వెళ్లిన భార్య... అవమానంతో భర్త ఏం చేశాడంటే?

    కుటుంబ కలహాలు సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. కొంతమంది భార్యలు భర్తల ఉసురుతీస్తుంటే, మరికొంతమంది భార్యలను హతమారుస్తున్నారు. తాజాగా  హైదరాబాద్ నగరంలో మరో కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారి తీసింది. మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.



  • Jul 26, 2025 09:33 IST

    B.Com, B.Tech సర్టిఫికెట్లు కావాలా నాయనా..శ్రీ వ్యాస కన్సల్టెన్సీ ఉందిగా..

    హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? దానికి తగిన చదువు, సర్టిఫికెట్లు లేవా? ఫికర్‌ మత్‌కరో భాయ్‌. B.Com, B.Tech..ఇలా ఏదైనా మనదగ్గర సరసమైన ధరలకు దొరకుతాయంటున్నారు కూకట్‌ పల్లిలోని KPHB ప్రాంతంలోని "శ్రీ వ్యాస కన్సల్టెన్సీ' నిర్వహకులు.

    Fake Certificates



  • Jul 26, 2025 07:57 IST

    ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్‌.. ఏంటి సార్ ఇది !

    ఓ ప్రొఫెసర్ చేసిన పొరపాటు 138 విద్యార్థులను ఫెయిల్‌ అయ్యేలా చేసింది. ఓ విద్యార్థి నుంచి ఈ తప్పును గుర్తించిన అధికారులు దాన్ని సరిచేసి ఫలితాలు ప్రకటించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

     

    JNTUH
    JNTUH

     



  • Jul 26, 2025 07:56 IST

    హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు విద్యుత్‌  సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ ఉండదని బోడుప్పల్‌ సబ్‌స్టేషన్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ వివరించారు.

    Power outage in Hyderabad today..



  • Jul 26, 2025 07:56 IST

    యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.

    Road Accident



  • Jul 26, 2025 07:55 IST

    ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

    ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతూనే ఉందని, మన జవాన్లు ఏడాది పొడవునా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. సైన్యం 365 రోజులు...24 గంటలూ అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు.

    CDS General Anil Chauhan



  • Jul 26, 2025 07:55 IST

    ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ రూట్లలో టికెట్ ధరలకు భారీ డిస్కౌంట్

    తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ధరలపై రాయితీ ప్రకటించింది. ఛార్చీలను 16 నుంచి శాతం వరకు తగ్గించింది.

     

    TGSRTC
    TGSRTC

     



Advertisment
తాజా కథనాలు