Bihar Woman: ఛీ.. ఛీ వీళ్లు మనుషులేనా.. పరీక్షకు హాజరైన యువతిపై అత్యాచారం..

బిహార్‌లో దారుణం జరిగింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Bihar woman raped by 2 in moving ambulance after she fainted in Home Guard exam

Bihar woman raped by 2 in moving ambulance after she fainted in Home Guard exam


బిహార్‌లో దారుణం జరిగింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే భోద్‌ గయలోని పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం హోంగార్డు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి హాజరయ్యింది. దేహదారుఢ్య పరీక్ష చేసే సమయంలో ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అక్కడున్న అధికారులు అంబులెన్స్‌కు చేసి ఆస్పత్రికి తరలించారు. 

Also Read: నంబర్.1 గా మోదీ.. దారుణంగా పడిపోయిన ట్రంప్.. తాజా సర్వేలో సంచలన విషయాలు!

Also Read :  మృత్యువుతో పోరాడుతూ కాపాడండి అంటూ బీటెక్‌ విద్యార్థిని..

Bihar Woman Raped By 2 In Moving Ambulance

ఆ యువతిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్‌ డ్రైవర్, టెక్నీషియన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ నిపుణల సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నేరం రుజువైతే నిందుతులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. 

Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

Also Read :  ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్‌.. ఏంటి సార్ ఇది !

telugu-news | rtv-news | bihar | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
తాజా కథనాలు