/rtv/media/media_files/2025/07/26/power-outage-in-hyderabad-today-2025-07-26-07-44-16.jpg)
Power outage in Hyderabad today..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్ ఉండదని బోడుప్పల్ సబ్‌స్టేషన్ ఏఈ ఎన్.వేణుగోపాల్ వివరించారు. అలాగే రామంతాపూర్ పాలిటెక్నిక్ సబ్ స్టేషన్ కేవీపీఎస్ కాలనీ ఫీడర్ పరిధిలోని శ్రీనివాసపురం ప్రాంతాలలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ కె.లావణ్య తెలిపారు.
Also Read : కొంపముంచిన ఫ్రూట్ జ్యూస్ డైట్..యూట్యూబ్ వీడియోలు చూసి
కరెంట్ ఉండని ప్రాంతాలివే...
బోడుప్పల్ సబ్‌స్టేషన్ మారుతీ నగర్ ఫీడర్ పరిధిలోని భవానీ నగర్, మారుతీ నగర్, మన్సానీ కాలనీ, గైలాక్స్ హోమ్స్, శ్రీసాయి ఎన్‌క్లేవ్, సిద్ధి వినాయక చిత్తారి, మణికంఠ నగర్, శుభోదయ కాలనీ, సుభాష్ నగర్, ఎస్సీ కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంటు సరఫరా ఉండదు. కేవీఎస్బీఆర్, వివేకానంద ఫీడర్ల పరిధిలోని బీఎల్ నగర్, రెడ్డీస్ కాలనీ, న్యూ భవానీ నగర్, పడమటి కాలనీ, ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ, శుభోదయ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ, అనఘాపురి కాలనీ, వివేకానందనగర్, మణికంఠ నగర్, శ్రీలక్ష్మి నగర్, ఐఐసీటీ, అశోక్ నగర్, భీంరెడ్డి కాలనీ, ఎన్‌ఐఎన్ కాలనీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.ఇక - రామంతాపూర్ పాలిటెక్నిక్ సబ్ స్టేషన్ కేవీపీఎస్ కాలనీ ఫీడర్ పరిధిలోని శ్రీనివాసపురం ప్రాంతాలలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
Also Read : బస్సు డ్రైవర్కు గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు!
ఫీడర్ల మరమ్మతు కారణంగా శనివారం పేట్‌బషీరాబాద్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు జయరామ్‌నగర్, శ్రీకృష్ణానగర్, గణేష్ కాలనీ, జేకే నగర్, రుక్మిణి ఎస్టేట్స్ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఇక మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు సుచిత్ర చౌరస్తా మెయిన్‌రోడ్డు, షాపింగ్ మాల్స్, కరాచీ బేకరీ , టీఎన్‌ఆర్ అపార్టుమెంట్స్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. అలాగే, కొంపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జయభేరి, బ్యాంక్ కాలనీ, జయభేరి శివాలయం, శ్రీనివాస్ కాలనీ, ఎన్‌సీఎల్ నోబుల్ ఎన్‌క్లేవ్, ఎన్‌సీఎల్ కాలనీ, సినీప్లానెట్ రోడ్డు, కేవీఆర్ గార్డెన్, విజయశాంతి విల్లాస్, కొంపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
Also Read : టెన్త్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఇన్‌స్టా చాటింగ్.. హైదరాబాద్ లో పెను విషాదం!
ఇక ఆజామాబాద్ డివిజన్ పరిదిలోని గోల్నాక ఏరియాలో ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు, బ్రాహ్మణ హాస్టల్ పరిధిలో 11.30 నుంచి 12.30 వరకు, ప్లేగ్రౌండ్ పరిధిలో 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సీఈ కాలనీ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వెంకటేశ్వరనగర్ ఫీడర్ పరిధిలోని వెంకటేశ్వరనగర్, రాఘవేంద్రనగర్, ఇందిరానగర్, హెచ్‌బీ కాలనీ, ఎంఐజి, ఎల్‌ఐజీ, హెచ్‌ఐజీ, ఈడబ్ల్యుఎస్, డైమండ్ హిల్స్ తదితర కాలనీలలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు.
Also Read : డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
chikkadapalli | ramanthapur | boduppal | power-outage | power