Operation Sindoor : ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతూనే ఉందని, మన జవాన్లు ఏడాది పొడవునా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. సైన్యం 365 రోజులు...24 గంటలూ అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు.

New Update
CDS General Anil Chauhan

CDS General Anil Chauhan

ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతూనే ఉందని, మన జవాన్లు ఏడాది పొడవునా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. సుబ్రోతో పార్కులో జరిగిన ఓ రక్షణ సెమినార్‌లో పాల్గొన్న ఆయన ఆపరేషన్‌ సిందూర్‌ సహా భవిష్యత్తు సైనిక సన్నద్ధతపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చౌహాన్ భవిష్యత్తులో యుద్ధగతి మారుతుందన్నారు. దానికి తగినట్లు సైనికులు ‘సమాచారం, సాంకేతికత, మేధస్సు’ వంటి మూడు నైపుణ్యాలను అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

Also Read :  ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్‌.. ఏంటి సార్ ఇది !

Also Read :  హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..

Operation Sindoor Continues - Army

యుద్ధాల్లో రన్నరప్‌లు ఉండరని.. అందుకే సైన్యాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, ఏ క్షణమైనా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘దీనికి ఆపరేషన్‌ సిందూర్‌ ఒక ఉదాహరణ. మనం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి. 365 రోజులు...24 గంటలూ అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. సైన్యం యుద్ధ విధానాలపై మాత్రమే కాదు సాంకేతికత, సమాచారం వంటి విషయాలపైనా పూర్తి అవగాహన కలిగిఉండాలి’’ అని సీడీఎస్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. 

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

indian army operation sindoor | india operation sindoor

Advertisment
తాజా కథనాలు