TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ రూట్లలో టికెట్ ధరలకు భారీ డిస్కౌంట్

తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ధరలపై రాయితీ ప్రకటించింది. ఛార్చీలను 16 నుంచి శాతం వరకు తగ్గించింది.

New Update
TGSRTC

TGSRTC

తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ధరలపై రాయితీ ప్రకటించింది. ఛార్చీలను 16 నుంచి శాతం వరకు తగ్గించింది. ప్రస్తుతం విజయవాడ నుంచి గరుడ ప్లస్‌ బస్సు టికెట్‌ ధర రూ.635 ఉండగా దాన్ని రూ.444కు తగ్గించింది. గరుడ క్లాస్‌ రూ.592 ఉండగా రూ.438కి తగ్గించింది. ఇక రాజధానీ ఎసీ రూ.533 నుంచి రూ.448కి.. అలాగే లగ్జరీ సూపర్‌ క్లాస్‌ ధరలను రూ.815 నుంచి రూ.685కి తగ్గించేసింది. 

Also Read: ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

Also Read :  ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్‌.. ఏంటి సార్ ఇది !

TGSRTC Announced Discounts On Bus Charges

అలాగే బెంగళూరు రూట్‌లలో చూసుకుంటే సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర ప్రస్తుతం రూ.946 ఉండగా దాన్ని రూ.757కి తగ్గించింది. అలాగే లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో బెర్త్‌ రూ.1569 నుంచి రూ.1177కి, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ధర రూ.1203 నుంచి రూ.903కి, బెర్త్‌ రూ.1569 నుంచి రూ.1177కి తగ్గించింది. ఈ రాయితీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లు వర్తిస్తాయని ఆర్టీసీ స్పష్టం చేసింది.  

Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

Also Read :  హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..

tgsrtc | telugu-news | rtv-news | telangana

Advertisment
తాజా కథనాలు