/rtv/media/media_files/2025/07/26/medical-student-dies-by-suicide-in-udaipur-2025-07-26-13-53-45.jpg)
Medical Student Dies By Suicide In Udaipur
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం జరిగింది. టీచర్ వేధింపుల తాళలేక ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌కు చెందిన శ్వేతా సింగ్ ఉదయ్‌పూర్‌లోని బీడీఎస్ ఫైనల్ ఇయల్ చదువుతోంది. శుక్రవారం తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె రూమ్‌మేట్ ఇది చూసి షాకైపోయింది. సమాచారం మేరకు హాస్టల్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also Read: ఆ నిర్మాతను చెప్పుతో కొట్టిన హీరోయిన్..కారణం ఏంటంటే..
ఆ గదిలో పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. టీచర్లు మానసికంగా తనను వేధిస్తున్నారని శ్వేత అందులో రాసింది. అలాగే పరీక్షలను కూడా నిర్దేశిత సమయంలో నిర్వహించడం లేదని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శ్వేత ఆత్మహత్య చేసుకోవడంతో కళాశాల విద్యార్థులు కాలేజీలో ఆందోళనలు చేపట్టారు. రోడ్లును బ్లాక్ చేశారు. సూసైట్ నోట్‌లో రాసిన టీచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Also Read: బంగ్లాదేశ్, పాకిస్థాన్ కొత్త వ్యూహం.. వీసా లేకుండానే రాకపోకలు
మరోవైపు ఈ సూసైడ్ కేసుపై పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విద్యార్థులతో కళాశాల డైరెక్టర్ చర్చలు జరిపారు. కాలేజీ యజమాన్యం కూడా దీనిపై చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శ్వేత సూసైడ్‌కు కారణమైన సిబ్బందిని తొలగిస్తామని స్పష్టం చేశారు. శ్వేత మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు పోలీసులు చెప్పారు.