/rtv/media/media_files/2025/07/26/soda-vs-water-2025-07-26-20-21-49.jpg)
దేశంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మద్యం ఆరోగ్యానికి హానికమని తెలిసిన కూడా పాటించేవాళ్లు తక్కువ. లిక్కర్ తాగేవారు సాధారణంగా సోడా లేదా వాటర్ వాడుతుంటారు. అయితే ఇందులో ఏదీ మంచిదా అనే అనుమానం మాత్రం చాలామందిలో ఉంటుంది. డైరెక్ట్ గా రా తాగలేరు కాబ్టి ఈ కాంబినేషన్ ను వాడుతుంటారు. అయితే ఆల్కహాల్‌తో సోడా (కార్బోనేటేడ్ పానీయాలు) కలుపుకోవడం కంటే నీళ్లు కలుపుకోవడమే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నీళ్లు కలుపుకుంటే కలిగే ప్రయోజనాలు:
ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తుంది (డీహైడ్రేషన్). నీళ్లు తాగడం వల్ల ఈ డీహైడ్రేషన్ తగ్గుతుంది, దీనివల్ల తలనొప్పి వంటి హ్యాంగోవర్ లక్షణాలు కూడా తగ్గుతాయి. నీళ్లు ఆల్కహాల్‌ను పలుచన చేస్తాయి, కాబట్టి అది రక్తంలోకి నెమ్మదిగా చేరుతుంది. దీనివల్ల మత్తు త్వరగా రాకుండా, ఎంత తాగుతున్నారో దానిపై మీకు నియంత్రణ ఉంటుంది. నీళ్లలో ఎటువంటి కేలరీలు ఉండవు. సోడాలో ఉండే చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. నీళ్లు సహజమైనవి శరీరానికి ఎటువంటి అదనపు రసాయనాలు లేదా చక్కెరలను చేర్చవు.
Also Read:"హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..
సోడా కలుపుకుంటే కలిగే నష్టాలు:
మత్తు వేగంగా ఎక్కుతుంది: సోడాలో ఉండే కార్బన్ డయాక్సైడ్ (వాయువు) ఆల్కహాల్‌ను రక్తంలోకి మరింత వేగంగా చేరేలా చేస్తుంది. దీనివల్ల మత్తు త్వరగా ఎక్కుతుంది. చాలా సోడాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం కావచ్చు.సోడాలు కూడా డీహైడ్రేషన్‌ను పెంచే అవకాశం ఉంది, ఇది హ్యాంగోవర్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది.
కాబట్టి, ఆల్కహాల్ తీసుకునేటప్పుడు వీలైనంత వరకు నీళ్లు కలుపుకోవడం మంచిది. ఇది మీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా మద్యం తాగడం మంచిది కాదు.. ఒకవేళ తాగాల్సి వస్తే మితంగా తాగడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
Also Read : Alcohol : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!