/rtv/media/media_files/2025/07/26/salaar-2-update-2025-07-26-18-24-45.jpg)
Salaar 2 Update
Salaar 2 Update: ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ "సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్" సినిమాకు సీక్వెల్‌గా రానున్న "సలార్ 2"పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) మధ్య పోటా పోటీ సన్నివేశాలు ఉండనున్నాయట.
Also Read: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
ప్రభాస్‌తో తలపడేందుకు ఎదురుచూస్తున్నా..
తాజాగా తన తాజా చిత్రం "సర్‍జమీన్" ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్, "సలార్ 2" గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈసారి కథ, స్కోప్ ఇంకా పెద్దదిగా, సన్నివేశాలు మరింత గ్రాండిగా ఉంటాయని వెల్లడించారు. "ప్రభాస్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ తో తలపడేందుకు ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యలతో సలార్ 2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. పృథ్వీరాజ్ పాత్ర ప్రభాస్ పాత్ర తో తలపడనుందట, ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయని పృద్వి తెలిపారు.
Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
అయితే, "సలార్ పార్ట్ 1"లో పృథ్వీరాజ్ పాత్రకు విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. పృథ్వి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రభాస్‌కు తక్కువేమీ కాదని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు. దింతో సీక్వెల్‌పై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగాయి. "సలార్ 2" ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాలలో ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ పార్ట్ 1 ని మించి ఉండబోతుందని తెలుస్తోంది.