/rtv/media/media_files/2025/07/26/jntuh-2025-07-26-07-48-25.jpg)
JNTUH
ఓ ప్రొఫెసర్ చేసిన పొరపాటు 138 విద్యార్థులను ఫెయిల్ అయ్యేలా చేసింది. ఓ విద్యార్థి నుంచి ఈ తప్పును గుర్తించిన అధికారులు దాన్ని సరిచేసి ఫలితాలు ప్రకటించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. JNTU నాలుగో ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు జూన్‌లో జరిగాయి. జూన్ 17న ఈ ఫలితాలు ప్రకటించారు. చివరి ఏడాదిలో క్రెడిట్ బెస్ట్ సబ్జెక్టు ఎన్సిరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసిస్‌మెంట్ (EIA) అనే సబ్జెక్టు ఉంటుంది.
Also Read: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
Also Read : నంబర్.1 గా మోదీ.. దారుణంగా పడిపోయిన ట్రంప్.. తాజా సర్వేలో సంచలన విషయాలు!
Professor Mistake Leads To Fail 138 Students
ఈ సబ్జెక్టులో శ్రీదత్త, మల్లారెడ్డి, షాదన్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో శ్రీదత్త కాలేజ్ స్టూడెంట్ JNTU పరీక్షల విభాగం అధికారులకు దీనిగురించి మెయిల్ చేశారు. EIA సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేందుకు ఛాన్స్ లేదని మరోసారి రిజల్ట్స్ చెక్ చేయాలని కోరాడు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తయ్యారు. 138 మంది ఫెయిల్ అయినట్లు గుర్తించారు. వాళ్ల ఆన్సర్ పేపర్‌ను పరిశీలించారు. అయితే ఈ పేపర్లు దిద్దిన ప్రొఫెసర్ పొరపాటు చేసినట్లు తేల్చారు.
Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
వాస్తవానికి EIA పరీక్షను ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో వేరు వేరు ప్రశ్నాపత్రాలతో నిర్వహించారు. అయితే ప్రొఫెసర్ కేవం ఉదయం నిర్వహించిన క్వశ్చన్ పేపర్‌తోనే సాయంత్రం జరిపిన ఆన్సర్ పేపర్లు కూడా దిద్దినట్లు అధికారులు గుర్తించారు. చివరికి సాయంత్రం క్వశ్చన్ పేపర్‌తో మళ్లీ దిద్దించగా విద్యార్థులందరూ పాస్ అయ్యారు. ఇక గురువారం రాత్రి ఈ రిజల్ట్స్‌ను సరిచేసి ఫలితాలు ప్రకటించారు.
Also Read : హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..
telangana | rtv-news | telugu-news | environment | engineering