TVS Ntorq 125 Super Soldier Edition: మార్కెట్‌లోకి ‘కెప్టెన్ అమెరికా’ స్కూటర్.. ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలివే!

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో కొత్త 'సూపర్ సోల్జర్ ఎడిషన్'ను విడుదల చేసింది. మార్వెల్ కెప్టెన్ అమెరికా థీమ్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర రూ. 98,117 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 124.8 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

New Update
TVS Ntorq 125 Captain America Edition Launched in India

TVS Ntorq 125 Captain America Edition Launched in India

టీవీఎస్ మోటార్ కంపెనీ తన NTORQ 125 (TVS NTORQ 125) స్కూటర్ శ్రేణిలో మరో కొత్త సూపర్ సోల్జర్ ఎడిషన్‌ను (TVS Ntorq 125 Super Soldier edition) లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 98,117 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల నుండి అన్ని టీవీఎస్ డీలర్‌షిప్‌లలో ఈ TVS NTORQ 125 స్కూటర్ అందుబాటులో ఉంటుంది. 

TVS Ntorq 125 Captain America Edition

ఇందులో బ్లూటూత్ ఆధారిత స్మార్ట్‌కనెక్ట్ కనెక్టివిటీ సిస్టమ్ ఉంది. ఇది స్కూటర్‌ను రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేస్తుంది. అలాగే స్కూటర్ డిస్ప్లేలో నావిగేషన్, రైడ్ డేటా, కాల్ అలర్ట్‌లను అందిస్తుంది. కొత్త సూపర్ సోల్జర్ ఎడిషన్ అద్భుతమైన డిజైన్, అదిరిపోయే లుక్‌తో వాహన ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తుంది. 

Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

కాగా ఈ TVS NTORQ 125 స్కూటర్ మార్వెల్ సూపర్ హీరోల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లను కలిగి ఉంది. ఈ సిరీస్‌లో ఇది కెప్టెన్ అమెరికా ప్రేరేపిత డిజైన్‌తో రెండవ వెర్షన్ కావడం విశేషం. ఇది 124.8 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 9.5 hp శక్తిని, 10.5 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. 

Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

స్పోర్టీగా కనిపించే ఈ స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీ, పూర్తిగా డిజిటల్ డిస్‌ప్లే, SmartXonnect  ఫీచర్లను కలిగి ఉంది. TVS NTORQ 125 వివిధ వెర్షన్లలో లభిస్తుంది. ఇది రేస్ ఎడిషన్, రేస్ XP వేరియంట్‌లతో వస్తుంది. 

Advertisment
తాజా కథనాలు