/rtv/media/media_files/2025/07/26/lover-boy-2025-07-26-12-09-26.jpg)
Lover Boy
అది అమావాస్య... అర్థరాత్రి..అంతా నిద్రపోతున్న వేళ ఓ యువకుడు తన ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆమెను ఎలాగైన దక్కించుకోవాలనుకున్న ఆరాటంలో గోడదుకాడు.కానీ ఆ తర్వాత జరిగింది తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. ఇంతకు ఏం జరిగిందంటే...
Also Read : హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..
Lover Seduce Girlfriend
ఏపీలోని తిరుపతి జిల్లాలో తను ప్రేమించిన యువతిని దక్కించుకోవాలనుకున్న ఒక యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. అది కూడా అర్థరాత్రి కానీ, అతని ప్రయత్నం విఫలమవ్వడమే కాకుండా జనం చేతిలో తన్నులు తిన్నాడు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. పెనుమూరుకు చెందిన సురేష్ తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కాలన్న ఆశతో ప్రియురాలిని తన వశం చేసుకునేందుకు ఓ మాంత్రికుడిని సంప్రదించాడు. ఆయన చెప్పినట్లు వశీకరణ యంత్రంతో మల్లయ్య పల్లికి బయలు దేరాడు.
ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..
సురేష్ చంద్రగిరి మండలం మల్లయ్య పల్లికి చెందిన ఇంటర్ చదివిన విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. కొంతకాలం ఆమె వెంటపడిన సురేష్ ఆమె దక్కకపోవడంతో వశీకరణ ప్రయత్నం చేశాడు. అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో మల్లయ్యపల్లికి చేరుకున్నాడు. అనుకున్నట్లే యువతి ఉండే ఇంటికి వెళ్లి గోడ దూకే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో శబ్ధం రావడంతో గమనించిన ఇంట్లోని ముసలమ్మ కేకలు వేసింది. ముసలమ్మ అరుపులకు గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. సురేష్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వెంటపడటంతో బయపబిన సురేష్ తిరగబడి వారిపై రాళ్లు విసిరాడు. అలా పారిపోతూ ముళ్లపొదల్లో దాక్కున్నాడు. దొంగగా భావించిన గ్రామస్తులు ముళ్లపొదల్లో దాక్కున్న సురేష్‌ను పట్టుకుని చావబాదారు. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.
Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
అయితే ఆ తర్వాత ఆరాతీస్తే సురేష్ ఆ గ్రామానికి ఎందుకు వచ్చాడన్నది గ్రామస్తులకు అర్థమైంది. యువకుడి వద్ద కత్తి, తాయత్తులు, మంత్రించిన నల్లని పౌడర్ లభించడంతో మరోసారి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు విచారించి సురేష్ దొంగ కాదని నిర్ధారించుకున్నారు. అనంతం కౌన్సిలింగ్ ఇచ్చి పెనుమూరులో ఉన్న కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు.
Also Read: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
villagers | the-girlfriend | girlfriend | chandragiri | chitoor-district