/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)
Trump
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పాయారు. అయితే ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ చేసేందుకు అమెరికా యత్నిస్తోంది. ఇటీవల అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించలేదు. తమకు దీనిపై ఆసక్తి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ గాజాలో తమ సైనిక చర్యలను మరింత ఉద్రిక్తం చేసి పనిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.
Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
Also Read : మస్త్ 'వైబ్ ఉంది బేబీ'.. మిరాయ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
Trump Says Hamas Wants To Die
'' హమాస్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆసక్తి చూపడం లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ తమ పనిని పూర్తి చేయాలని'' ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా గాజాలో పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. తిండి లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా గాజాపై దాడులు చేసే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అలాగే గాజాలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకొచ్చేందుకు, హమాస్ పాలనను అంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నట్లు నేతన్యాహు తెలిపారు.
Also Read: నంబర్.1 గా మోదీ.. దారుణంగా పడిపోయిన ట్రంప్.. తాజా సర్వేలో సంచలన విషయాలు!
మరోవైపు గాజాలోని అక్కడి ప్రజలకు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు మానవతా సాయం చేస్తున్నాయి. గాజాలో ఉండే మానవతా కేంద్రాలకు ఆహారం కోసం వచ్చే ప్రజలపై కూడా ఇజ్రాయెల్ ఇటీవల కాల్పులు జరపడం కలకలం రేపింది. గత 21 నెలలుగా గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో 59 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇటీవల అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది.
Also Read : TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
Israel Hamas War | rtv-news | telugu-news