/rtv/media/media_files/2025/07/26/pm-modi-2025-07-26-08-27-00.jpg)
PM Modi tops list of global leaders with 75% approval, Trump ranks 8th, Survey
ప్రపంచ దేశాధినేత ర్యాంకింగ్ లిస్ట్‌లో భారత ప్రధాని మోదీ మరోసారి టాప్ 1 లో నిలిచారు. 'డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్' జాబితాలో 75 శాతం ఓటింగ్‌తో మొదటి స్థానం సాధించారు. యూఎస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన మర్నింగ్ కన్సల్ట్ ఈ డేటాను విడుదల చేసింది. ఇక సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మైయుంగ్ 50 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలే మూడో స్థానం, కెనడా ప్రధాని మార్క్ కార్నీ నాలుగో స్థానం, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ ఆల్బనీస్ అయిదో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 45 శాతం ఓటింగ్‌తో 8వ స్థానంలో నిలిచారు.
Also Read: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
Also Read : ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో టికెట్ ధరలకు భారీ డిస్కౌంట్
PM Modi Tops List Of Global Leaders
ఈ సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది ప్రధాని మోదీని డెమోక్రటిక్ వరల్డ్ లీడర్‌గా ఆమోదం తెలిపారు. 18 శాతం మంది ఇతరులను సూచించారు. మరో 7 శాతం మంది ఏమీ చెప్పలేదు. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచిన సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మైయుంగ్‌కి 59 శాతం మంది ఆమోదం తెలిపారు. 29 శాతం మంది దీనికి ఒప్పుకోలేదు. మిగిలిన 13 శాతం మంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
ఇదిలాఉండగా నరేంద్ర మోదీ ఇప్పటిదాకా 4078 రోజులు పనిచేసిన ప్రధానిగా అప్పటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున ప్రధాని మోదీ ప్రపంచ డెమోక్రటిక్ లీడర్స్‌లో మొదటి స్థానంలో రావడం మరో విశేషం. గతంలో ఇందిరా గాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4077 రోజులుగా ప్రధానిగా ఉన్నారు. తాజాగా ఆమె రికార్డును ప్రధాని మోదీ బ్రేక్ చేశారు. నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : కేబుల్ బ్రిడ్జిపై ఆత్మహత్యకు యత్నం.. లైవ్ లో కాపాడిన హైడ్రా!
pm modi | rtv-news | telugu-news