/rtv/media/media_files/2025/07/26/actor-tanushree-dutta-2025-07-26-13-12-15.jpg)
Actor Tanushree Dutta
బాలీవుడ్ నటి తనుశ్రీ గత ఐదేళ్లుగా తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని, తన ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ ఏడుస్తూ ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గతంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.
Also Read : మస్త్ 'వైబ్ ఉంది బేబీ'.. మిరాయ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
Also Read : తెలంగాణలో మరో రెండు రోజులు దంచికొట్టనున్న వర్షాలు! ఆ జిల్లాలకు హై అలెర్ట్..
Also Read : మృత్యువుతో పోరాడుతూ కాపాడండి అంటూ బీటెక్ విద్యార్థిని..
నా ప్రాణాలకు ముప్పు!
"బాలీవుడ్ మాఫియా చాలా పెద్దది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాగే, నా ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. నన్ను కూడా సుశాంత్ లాగే చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని సంచలన ఆరోపణలు చేసింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020లో ముంబైలోని తన ఇంట్లో చనిపోయారు. ఆయన మరణంపై చాలా విభిన్న స్పందనలు, అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అలాగే తాజాగా తన శ్రీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెడుతూ.. వేధింపులపై తాను చేసిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి తనకు చాలా ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయని, వాటిని తట్టుకోలేకపోతున్నానని తెలిపింది. ''కొన్ని రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటూనే ఉన్నాను. ప్రస్తుతం నాకు ఆరోగ్యం బాగాలేదు. అందుకే కాస్త టైం తీసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా అందరితో మాట్లాడతాను. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి ’’ అని తెలిపారు.
Also Read:Hari Hara Veera Mallu: థియేటర్ వద్ద పిడిగుద్దులతో తనుకున్న పవన్ ఫ్యాన్స్! వీడియో వైరల్
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | tanushree-dutta