/rtv/media/media_files/2025/07/26/nivetha-manoj-2025-07-26-14-44-02.jpg)
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం హరి హర వీరమల్లు. ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ తెరకెక్కింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఐదేళ్లుగా రూపొందిన ఈ చిత్రం ఫైనల్ గా భారీ అంచనాల నడుమ 2025 జులై 24వతేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ దృష్ట్యా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
అయితే ఈ సక్సెస్ మీట్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈవెంట్ లో ఓ పవన్ ఫ్యాన్ కమ్ నటి తన అభిమాన నటుడి కాళ్లు మెక్కి అతని చెయి పట్టుకుని ఫోటో దిగింది. ఆనందంతో గెంతులేసింది. ఆమె చర్యలతో పవన్ కూడా సిగ్గు పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీంతో ఎవరీ అమ్మాయి అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తాగి పడేసిన వాటర్ బాటిల్ దాచుకున్న
— Anitha Reddy (@Anithareddyatp) July 26, 2025
పవన్ తో ఒక సినిమా చేసి చనిపోయినా చాలు - నివితా మనోజ్ pic.twitter.com/Ib3ZjZBpzm
ఆమె పేరు నివితా మనోజ్. హరిహర వీరమల్లు సినిమాలోనూ ఓ రోల్ పోషించింది. ఆమె నటిగా కంటే ముందు టీవీ యాంకర్. చాలామంది సెలబ్రేటీలను ఇంటర్వ్యూ కూడా చేసింది. నివితా పవన్ కల్యాణ్ కు వీర అభిమాని. ఇక సోషల్ మీడియాలో కూడా నివితా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన అభిమానులతో ముచ్చటిస్తుంటారు. సక్సెస్ మీట్ లో పవన్ ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడటంతో ఆమెకు ఫాలోవర్లు కూడా వీపరితంగా పెరిగారు. మొత్తానికి ఈ అమ్మాయి పవన్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనే చెప్పాలి. ఈమెకు పెళ్లి కాగా ఓ కూతురు కూడా ఉంది.
మిశ్రమ స్పందన
ఇక సినిమా విషయానికి వస్తే.. 'హరిహర వీరమల్లు' 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రను పోషించారు. మొఘల్ పాలకుల చేతుల్లో బందీగా ఉన్న ఒక నగరాన్ని విముక్తి చేయడానికి, అణగారిన ప్రజలలో ఆశను నింపడానికి వీరమల్లు విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక సాహసోపేతమైన మిషన్‌ను చేపడతాడు. విడుదలైన మొదటి రోజు, సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కొందరు ప్రశంసించగా, వీఎఫ్‌ఎక్స్ నాణ్యత, కథనం కొంత నిరాశపరిచిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రం 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' (Sword vs Spirit) పేరుతో విడుదలైంది. క్లైమాక్స్‌లో దీని సీక్వెల్ 'హరిహర వీరమల్లు: పార్ట్ 2 – బ్యాటిల్‌ఫీల్డ్' టైటిల్‌ను వెల్లడించారు. ఇక ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చు.