/rtv/media/media_files/2025/07/26/high-tension-at-padi-kaushik-reddy-house-2025-07-26-12-39-35.jpg)
High tension at Padi Kaushik Reddy's house
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటివద్ద హై టెన్షన్ నెలకొంది. ఒకవైపు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన ఇంటి వద్ద హైడ్రమా కొనసాగుతోంది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది. హీరోయిన్ల ఫోన్‌లను ట్యాప్ చేయిస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఎన్ఎస్‌యూఐ హైదరాబాద్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. మరో వైపు కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
Also Read : ప్రియురాలిని వశీకరణం చేసుకునేందుకు గోడ దూకాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ చేరుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక్‌రెడ్డి ఇంటివద్ద ఆయనకు మద్ధతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలోని ఎమ్మెల్యేల ఫోన్‌లు ట్యాపింగ్ చేయిస్తున్నారని, ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి.
Also Read : అమ్మో.. ప్రధాని మోదీ విదేశీ టూర్ల కోసం అన్ని వందల కోట్లా ?
కౌశిక్‌రెడ్డి పై కేసు నమోదు
మరోవైపు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్‌లను ట్యాప్ చేయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో నిన్న కాంగ్రెస్ మహిళ నేత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత ఫిర్యాదు చేశారు. అలాగే రాజేంద్ర నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి శనివారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి పై తాజాగా కేసు నమోదు అయింది.
Also Read : పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు
Also Read : ఆ క్యాంటీన్లలో రూ.5 కే ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఎప్పటి నుంచంటే..
paadi-kaushik-reddy | brs mla koushik reddy | cm-revanthreddy | phone tapping case | Phone Tapping | phone tapping case latest update