/rtv/media/media_files/2025/07/26/the-resistance-front-2025-07-26-10-41-37.jpg)
the resistance front
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల TRFను అమెరికా ఉగ్రసంస్థగా కూడా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది. TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇషాక్ మాట్లాడారు. TRFను ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉందని.. దీనిపై మాకు అభ్యంతరాలు లేవని తెలిపారు.
Also Read: పాకిస్థాన్‌ను చావుదెబ్బతీసి...జాతీయజెండాను రెపరెపలాండించి...
TRF As Terror Group
వాళ్ల ప్రమేయం ఉందనే ఆధారాలు ఉంటే అలా చేయవచ్చని తెలిపారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ టీఆర్‌ఎఫ్‌ను లష్కరే తయిబా అనుబంధ సంస్థగా చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఆ సంస్థను తాము కొన్నేళ్ల క్రితమే కూల్చేశామని తెలిపారు. వాళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టామని చెప్పారు. ఇక్కడే మరో విషయం ఏటంటే ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పహల్గాం ఉగ్రదాడిని ఖండించే తీర్మానంలో TRFను ప్రస్తావించడాన్ని ఇషాక్ దార్ వ్యతిరేకించారు. TRF కార్యకలాపాలకు సంబంధించి పాకిస్థాన్‌కు మరిన్ని ఆధారాలు కావాలని చెప్పారు.
Also Read: ట్రెండ్ సెట్ చేద్దామని నడి రోడ్డు మీద కారుపై డ్యాన్స్.. చివరకు ఏమైందంటే?
ఇదిలాఉండగా కొన్నిరోజుల క్రితం అమెరికా TRFను విదేశీ ఉగ్రవాద సంస్థగా.. ప్రత్యేకంగా ముద్రపడిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా (SDGT)గా ప్రకటించింది. తమ జాతీయ భద్రతను కాపడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం ఉగ్రదాడికి న్యాయం చేసేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని విదేశాంగ మంత్రి మార్కో తెలిపారు. అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. తాజాగా పాకిస్థాన్ కూడా TRFను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. కానీ లష్కరే తయిబాతో పహల్గాం దాడికి లింక్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.
Also Read : పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు
Also Read : మస్త్ 'వైబ్ ఉంది బేబీ'.. మిరాయ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
Pahalgam attack | rtv-news | telugu-news