Saiyaara Collections: రికార్డులు క్రియేట్ చేస్తున్న 'సయ్యారా' కలెక్షన్స్..!

అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన "సయ్యారా" ఎనిమిదో రోజుకే రూ.190.75 కోట్లు వసూలు చేసి, 2025లో టాప్ బాలీవుడ్ హిట్‌గా నిలిచింది. ఈ శనివారానికి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

New Update

Saiyaara Collections: లేటెస్ట్ సెన్సేషన్ అహాన్ పాండే(Ahaan Panday), అనీత్ పడ్డా(Aneet Padda) హీరో హీరోయిన్లగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా "సయ్యారా" విడుదలైన మొదటి వారం నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఎనిమిదవ రోజుకి రూ.18 కోట్లు వసూలు చేయడంతో, మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ ఇప్పుడు సుమారు రూ.190.75 కోట్లకు చేరింది.

'సయ్యారా' ఇప్పటికే అక్షయ్ కుమార్ నటించిన 'హౌస్‌ఫుల్ 5' (రూ.183 కోట్లు), అజయ్ దేవ్‌గన్ 'రైడ్ 2' (రూ.173 కోట్లు) లాంటి సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

Also Read: ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

శనివారంకి రూ.200 కోట్ల క్లబ్‌లో..

ఈ శుక్రవారం కూడా ఎలాంటి హిందీ సినిమా విడుదల కానందున, 'సయ్యారా'కు వసూళ్ల పరంగా పోటీ లేదు. దీంతో ఈ శనివారం నాటికి ఇది రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇది 2025లో విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ తర్వాత ఆ ఘనత సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలవనుంది.

Also Read: TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

కథ పరంగా చూస్తే, సినిమా క్రిష్ కపూర్ (Ahaan Panday) అనే యువ సంగీతకారుడు, వాణీ బత్రా (Aneet Padda) అనే రచయిత మధ్య ప్రేమను చాలా అద్భుతంగా చూపించారు. లవ్, ఎమోషన్స్, బ్రేక్ అప్ సీన్లను డైరెక్టర్ మోహిత్ సూరి తనదైన శైలిలో తెరకెక్కించారు.

Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

అయితే ‘సయ్యారా’ ఆగస్టు 1న విడుదలవుతున్న ‘ధడక్ 2’ వరకు థియేటర్లలో విజయవంతంగా కొనసాగే అవకాశాలున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ సినిమా, ప్రస్తుతానికి బాక్సాఫీస్‌ హిట్ అయ్యి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.

Also Read: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!

Advertisment
తాజా కథనాలు