/rtv/media/media_files/2025/07/26/pm-modi-2025-07-26-13-06-40.jpg)
PM Modi
ప్రధాని మోదీ అప్పుడప్పుడు విదేశీ టూర్లకు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయా దేశాలతో దౌత్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే ఇలా విదేశాలకు వెళ్లేందుకు భారీగానే ఖర్చవుతోంది. 2021 నుంచి 2025 మధ్య ఆయన విదేశీ పర్యటనల కోసం ఏకంగా రూ.362 కోట్లు ఖర్చయ్యాయి. ఈ ఏడాదిలోనే ఆయన పర్యటనల కోసం ఏకంగా రూ.67 కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం.
Also Read: ఛీ.. ఛీ వీళ్లు మనుషులేనా.. పరీక్షకు హాజరైన యువతిపై అత్యాచారం..
PM Modi Foreign Trips
వీటిలో ఫ్రాన్స్, అమెరికా వంటి ఉన్నతస్థాయి విదేశీ పర్యటనలతో సహా అయిదు పర్యటనలు ఉన్నాయి. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ దీనిగురించి ప్రశ్నించారు. కేంద్ర సహాయ విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన అందించిన డేటా ప్రకారం.. 2025లో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో అత్యంత ఖరీదైంది ఫ్రాన్స్ పర్యటన. దీనికోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చయ్యింది. ఆ తర్వాత అమెరికా పర్యటన కోసం రూ.16 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
Also Read: ముంబయి ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు.. తీరా వెళ్లిచూస్తే ?
ఇంకా మారిషస్, సైప్రస్, కెనడా దేశాల అదనపు పర్యటనల ఖర్చులు వీటికి కలపలేదు. 2024లో ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్‌తో సహా 16 దేశాల్లో పర్యటించారు. వీటి కోసం రూ.109 కోట్లు చేశారు. 2023లో దాదాపు రూ.93 కోట్లు ఖర్చు చేశారు. 2022లో రూ.55.82 కోట్లు, 2021లో రూ.36 కోట్లు ఖర్చు చేశారు. 2021లో కేవలం అమెరికా పర్యటన కోసమే రూ.19 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే ఈ ఖర్చులు అనేవి కేవలం పర్యటనకే కాకుండా.. దానికి సంబంధించిన ప్రకటనలు, ప్రసార ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రధాని పర్యటన కోసం ఇంత భారీగా ఖర్చు కావడం చర్చనీయాంశమవుతోంది.
Also Read : నన్ను చంపేస్తారు..! గుక్కపట్టి ఏడుస్తున్న హీరోయిన్ (వీడియో వైరల్)
Also Read : ఆ క్యాంటీన్లలో రూ.5 కే ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఎప్పటి నుంచంటే..
national-news | pm modi | rtv-news | telugu-news