Mumbai Airport: ముంబయి ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు.. తీరా వెళ్లిచూస్తే ?

ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామని.. త్వరలో భారీ పేలుడు జరగబోతోందని ఓ కాల్‌ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాంబు స్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టగా ఏమీ లేదని తేల్చారు.

New Update
Mumbai airport

Mumbai airport

ఈ మధ్య ఎయిర్‌పోర్టులు, పాఠశాలల్లో బాంబు పెట్టామంటూ బెదిరిస్తున్న ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామని.. త్వరలో భారీ పేలుడు జరగబోతోందని ఓ కాల్‌ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాంబు స్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టింది. అన్నిచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్లకి ఎలాంటి అనుమానస్పద వస్తువు కనిపించలేదు. చివరికి బాంబు లేదని నిర్ధారించారు. 

Also Read: పాకిస్థాన్‌ను చావుదెబ్బతీసి...జాతీయజెండాను రెపరెపలాండించి...

Also Read :  పెన్షన్ దారులకు గుడ్‌ న్యూస్‌...ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు

Bomb Threat Calls To Mumbai Airport

ఇదంతా బూటకమని తేల్చేశారు. అయితే అస్సాం, పశ్చిమ బెంగాల్‌ సరిహద్దు సమీపంలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మొబైల్‌ నుంచి ఈ బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.  గతంలో కూడా ముంబయి ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. కానీ అవి కూడా బూటకమని తేలిపోయింది. ఇదిలాఉండగా ఈమధ్యకాలంలో ఈ బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్‌ రావడం సాధారణం అయిపోయింది. 

Also Read: TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

Also Read :  మస్త్  'వైబ్ ఉంది బేబీ'.. మిరాయ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!

bomb-threat | Mumbai Airport | rtv-news | telugu-news

Advertisment
తాజా కథనాలు