/rtv/media/media_files/2025/07/26/the-heroine-hit-the-producer-with-a-shoe-2025-07-26-13-40-11.jpg)
The heroine hit the producer with a shoe
‘సో లాంగ్ వ్యాలీ’ చిత్ర నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్‌పై సీరియల్ హీరోయిన్ రుచి గుజ్జర్ చెప్పుతో దాడిచేసి కొట్టింది.ఈ మూవీ స్క్రీనింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో నిర్మాతపై గుజ్జర్ దాడిచేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కరణ్ సింగ్ చౌహాన్ తను నిర్మించే ఒక హిందీ టెలివిజన్ సీరియల్ నిర్మాణానికి తనను సహ-నిర్మాతగా చేరాలని కోరాడని, ఆయనను నమ్మిన తాను రూ.24 లక్షలు చెల్లించానని రుచి తెలిపింది. దానికి సంబంధిత పత్రాలను కూడా తనకు అందించాడని రుచి గుజ్జర్ తెలిపింది.
Karan Singh Chauhan Hit Producer With A Shoe
मुंबई में एक्ट्रेस रुचि गुज्जर ने फिल्म 'So Long Valley' के प्रोड्यूसर करण सिंह चौहान के खिलाफ धोखाधड़ी, आपराधिक विश्वासघात और धमकी देने के आरोप में FIR दर्ज कराई है. मामला एक हिंदी टेलीविजन सीरियल के को-प्रोडक्शन से जुड़े 24 लाख रुपये के वित्तीय विवाद से जुड़ा है. रुचि गुज्जर ने… pic.twitter.com/SidbUs8Au1
— ABP News (@ABPNews) July 26, 2025
Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
ఈ హామీలను నమ్మి, రుచి తన కంపెనీ ఎస్‌ఆర్ ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ₹24 లక్షలను జూలై 2023 నుండి జనవరి 2024 మధ్య వివిధ బ్యాంకు ఖాతాలకు చెల్లింపుల రూపంలో బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరింది. కానీ కరణ్ సింగ్ చౌహాన్ దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కరణ్ సింగ్ చౌహాన్‌పై మోసం, నమ్మకద్రోహం, బెదిరింపులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
ఇదిలా ఉండగా తన డబ్బుల గురించి అడిగిన ప్రతిసారి కరణ్ తప్పించుకు తిరుగుతున్నాడని, అతను సాకులు చెప్పి, అబద్ధాలు చెప్పాడని ఆమె ఆరోపించింది. డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తే తనపై బెదిరింపులకు దిగాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. కాగా చిత్ర ప్రదర్శన సమయంలో రుచి గుజ్జర్ నిర్మాతను చెప్పుతో కొడుతూ నిరసన తెలిపింది.
Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
కాగా, ఈ మేరకు పోలీసులు నిర్మాతపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 352, 351(2) కింద కేసు నమోదు చేసి.. బ్యాంకు లావాదేవీలు, కాల్ రికార్డులు, ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దానితో పాటు రుచి గుజ్జర్ దిండోషి సివిల్ కోర్టులో ‘సో లాంగ్ వ్యాలీ’ బృందం, నటులు అకాంక్ష పురి, త్రిధా చౌదరి, విక్రమ్ కొచ్చార్, నిర్మాతలు చౌహాన్, మాన్ సింగ్, సౌర్య స్టూడియోస్‌లపై కూడా సివిల్ కేసు దాఖలు వేసింది.
Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?
Also Read : ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు
crime news | heroine | producer | serials | daily-serial | mumbai