BRSను BJPలో విలీనం చేస్తామనలేదా.. గుండెల మీద చేయి వేసి చెప్పు KTR :  సీఎం రమేష్

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సంచలనల ఆరోపణలు చేశారు. కవితపై లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతామని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.

New Update
cm ktr

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సంచలనల ఆరోపణలు చేశారు. కవితపై లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతామని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. విలీనం కోసం మా ఇంటికి వచ్చింది మరిచిపోయారా అని నిలదీశారు. కేటీఆర్ కోరిక మేరకే తాను బీజేపీ పెద్దలను కలిశానని అన్నారు.  అయితే బీఆర్ఎస్ అయిపోయిన పార్టీ తమకు అవసరం లేదని అన్నారని సీఎం రమేష్ వెల్లడించారు.  ఇదే విషయాన్ని తాను కేటీఆర్ కూడా చెప్పానన్నారు.  ఇది నిజం కాదని కేటీఆర్ గుండె మీద చెయి వేసుకుని చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో సిరిసిల్లాలో నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచావో చెప్పమంటావా అని అన్నారు.   అనకాపల్లి తన కార్యాలయంలో సీఎం రమేష్ శనివారం  మీడియా సమావేశం నిర్వహించారు. 

కేటీఆర్ ఆరోపణలు చేయడం మూర్ఖత్వం

తెలంగాణలో రిత్విక్ కంపెనీకి రూ.1660 కోట్ల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి తనపై కేటీఆర్ ఆరోపణలు చేయడం మూర్ఖత్వమన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి తాను కాంట్రాక్ట్ పొందాను అవాస్తవమని తెలిపారు.  అసలు ఆ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.  ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తుందో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.  అనవసరంగా తనను కెలికితే ఇంకా  చాలా నిజాలు బయటకు చెప్పాల్సి వస్తుందన్నారు సీఎం రమేష్.  బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని.. అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది తన  దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. 

Also Read :  Crime: టీచర్ల వేధింపులు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు